Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. 

Last Updated : Aug 22, 2020, 08:38 AM IST
 Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

Megastar Chiranjeevi birthday Common DP released: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. అలాంటి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ( Megastar Birthday) అంటే తెలుగు రాష్ట్రాల్లో మామూలు హడావిడి ఉండదు. ఈ రోజుతో (ఆగస్టు 22) మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇంకేముంది నిన్నటినుంచే చిరు బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా.. ఆయన ఫ్యాన్స్, ప్రముఖులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోస్టర్లను పంచుకుని మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Also read: #Chiranjeevi152: మెగాస్టార్ 152వ చిత్రం ఫస్ట్ లుక్ తేదీ ప్రకటించిన రామ్ చరణ్

chiranjeevi-birthday-cdp

ఇదిలాఉంటే.. మెగాస్టార్ తనయుడు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) .. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారమే ఓ కామన్ డీపీని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇది ఒక్కటే కాదు..  చిరు బర్త్ డే సందర్భంగా ఒకేసారి 100 మంది సినీ ప్రముఖులు, అభిమానులు కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే రామ్ చరణ్ పంచుకున్న పోస్టర్‌లో.. చిరంజీవి కెరిర్‌లో అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని చూపించారు. ఖైదీ, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, స్వయంకృషి, ఇంద్ర, ఖైదీనంబర్ 150 లాంటి చిత్రాల్లో ఉన్న పాత్రలను దీనిలో ఉంచారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

Trending News