Chiranjeevi Family Tour : చిరంజీవి ఫ్యామిలీ టూర్‌.. శ్రీజ, ఉపాసన కామెంట్స్

Chiranjeevi Family Tour : కొన్ని రోజుల పాటు విరామం తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్లారు మెగాస్టార్. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఆయన సతీమణి సురేఖతో కలిసి తొలిసారి ఈ పర్యటనకు వెళ్లారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 10:53 PM IST
  • విదేశీ పర్యటనకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి
    ఆయన సతీమణి సురేఖతో కలిసి పర్యటన
    బెస్ట్ విషెస్ తెలిపిన ఉపాసన, శ్రీజ
Chiranjeevi Family Tour : చిరంజీవి ఫ్యామిలీ టూర్‌.. శ్రీజ, ఉపాసన కామెంట్స్

Chiranjeevi Family Tour : ఆచార్య సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా షూటింగులకు చిన్న బ్రేక్ ఇచ్చారు చిరంజీవి. కొన్ని రోజుల పాటు విరామం తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్లారు మెగాస్టార్. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఆయన సతీమణి సురేఖతో కలిసి తొలిసారి ఈ పర్యటనకు వెళ్లారు. అమెరికా, యూరప్‌ వెళ్తున్నట్టు సోషల్‌ మీడియాలో అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. ఈ టూర్‌ గురించి తెలుసుకున్న పలువురు హ్యాపీ జర్నీ అంటూ విషెస్ పెడుతున్నారు.

చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌పై మెగా డాటర్ శ్రీజతో పాటు మెగా కోడలు ఊపాసన స్పందించారు. ‘ఎంజాయ్‌ అమ్మ అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్‌’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య’ అని ఉపాసన పోస్ట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి మోహన్‌ రాజా దర్శకత్వంలో నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ యూనిట్ నుంచి అభిమానులకు క్రేజీ అప్‌డేట్ అందింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్‌లో వచ్చే హుషారైన పాటకు ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. సంగీత దర్శకుడు థమన్ ఇందుకు సంబంధించి ఓ ఫొటోను విడుదల చేశారు.

గతంలో ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్ వచ్చినందున... ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో ఈ కాంబోలో రానున్న స్టెప్స్‌పై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరుగుతోంది. మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. పొలిటికల్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్‌ అమ్మ అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్‌’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య’ అని ఉపాసన కామెంట్‌ చేశారు.

 

గాడ్‌ఫాదర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాక, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. వెంకీ కుడుములతోనూ చిరు మరో చిత్రం ఖరారు చేశారు. సీనియర్ నటి రాధిక నిర్మాణ సంస్థ సారథ్యంలోనూ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు మెగాస్టార్.

 Also Read - Prashanth Kishore Trs Survey: పీకే రిపోర్ట్.. టీఆర్ఎస్ కు 28 సీట్లు..!

Also Read - Keerthy Suresh: మహేశ్ బాబును 3 సార్లు కొట్టాను... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News