ర‌ష్మిక క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఫుడ్ సంస్థ.. రష్మిక మీల్స్‌ ఆఫర్

McDonald’s India launches ‘The Rashmika Meal’ : ర‌ష్మిక క్రేజ్ ను (Rashmika) క్యాష్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించింది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ...ది రష్మిక మీల్.. అని ప్రత్యేకంగా అందిస్తోంది మెక్‌డొనాల్డ్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 06:10 PM IST
  • తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్తున్న రష్మిక
  • నేషనల్ క్రష్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్
  • ర‌ష్మికతో ఒప్పందం కుదుర్చుకున్న ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్
  • రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించిన మెక్‌డొనాల్డ్స్
ర‌ష్మిక క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఫుడ్ సంస్థ.. రష్మిక మీల్స్‌ ఆఫర్

McDonald’s India launches ‘The Rashmika Meal’ in collaboration with the popular Heroine Rashmika Mandanna: ఒక వైపు తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్తూ.. మరో వైపు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది రష్మిక. త్వరలోనే ఈ భామ.. బాలీవుడ్ ఫస్ట్ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ తో పుష్ప మూవీలో నటిస్తోంది రష్మిక. ఈ.. నేషనల్ క్రష్‌కు (National Crush) ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో (social media) మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్ హీరోయిన్స్ లలో (South Heroines) టాప్ లిస్ట్‌లో ఉంది రష్మిక. రష్మికకి ఇటీవల యాడ్స్ కూడా బాగానే వస్తున్నాయి. 

తాజాగా ర‌ష్మిక క్రేజ్ ను (Rashmika) క్యాష్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించింది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ...ది రష్మిక మీల్.. అని ప్రత్యేకంగా అందిస్తోంది మెక్‌డొనాల్డ్స్.

Also Read : 'చంద్రబాబు సతీమణి ప్రస్తావన శాసనసభలో రాలేదు.. అదంతా ఆయన డ్రామా'

ది రష్మిక మీల్ లో (The Rashmika Meal) రష్మికకు ఇష్టమైన మెక్ స్పైసి, ఫ్రైడ్ చికెన్, మెక్ స్పైసి చికెన్ బర్గర్, పెరి పెరి ఫ్రైస్, నింబూ ఫిజ్, మెక్ ఫ్లరీ ఉంటాయి. ఇక... మెక్‌డొనాల్డ్స్ తన కంఫర్ట్ ఫుడ్ అని... మెక్‌స్పైసీ చికెన్ బర్గర్‌లో పెరి పెరి ఫ్రైస్‌ని ఉంటే తనకు చాలా ఇష్టమని రష్మిక (Rashmika) చెప్పుకొచ్చింది. తన మెక్‌డొనాల్డ్స్ ఫేవరెట్‌లను అందరితో పంచుకోవడానికి తాను చాలా సంతోషిస్తున్నానని తెలిపింది.

Also Read : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News