Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Ponniyin Selvan 2 Release Date కోలీవుడ్‌కు బాహుబలి లాంటి ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్‌ను మణిరత్నం ఎంత గ్రాండ్‌గా నిర్మించాడో అందరికీ తెలిసిందే. అయితే మొదటి పార్ట్‌ తెలుగు వారిని అంతగా మెప్పించలేకపోయింది. ఎవరి పాత్ర ఏంటి.. ఎవరేం చేస్తున్నారు.. అసలేం జరుగుతోందో అర్థం కాకుండాపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2022, 10:39 AM IST
  • పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 అప్డేట్
  • సమ్మర్‌ కానుకగా రెండో భాగం
  • ఈసారైనా తెలుగులో హిట్ అవుతుందా?
Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Ponniyin Selvan 2 Release Date : మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాను కోలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. కానీ మిగతా ఇండస్ట్రీల్లో మాత్రం పొన్నియిన్ సెల్వన్‌కు అంత ఆదరణ దక్కలేదు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులుకు ఈ చిత్రం ఏ మాత్రం కూడా ఎక్కలేదు. కథ, కథనాలు అంతా గందరగోళంగా ఉండటంతో ప్రేక్షకులకు దిమ్మతిరిగింది. విజువల్‌గా సినిమా ఎంతో గ్రాండియర్‌గానే అనిపించింది. కానీ కథలోనే తికమక పెట్టేశాడు మణిరత్నం.

చోళులు, పాండ్యులు అంటూ మనకు అంతగా పరిచయం లేని చరిత్రను చెప్పే ప్రయత్నంలోనే క్లారిటీ మిస్ అయినట్టుంది. ఇది తమిళ చరిత్ర కావడంతో మన వాళ్లకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. అయితే తమిళ నాట మాత్రం ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపుగా ఈ చిత్రం నాలుగు వందల కోట్లకు పైగా కొల్లగొట్టేసినట్టు తెలుస్తోంది.

 

అయితే పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్‌ మీద అప్డేట్ వచ్చింది. ఈ రెండో  పార్టును సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మేరకు మేకర్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాజ్యాధికారం ఎవరికి కట్టబెట్టారో చూపిస్తున్నట్టుగా ఉంది. ఈ రెండో పార్టులో జయం రవి పాత్రే హైలెట్ అయ్యేలా ఉంది. మొదటి పార్ట్ మొత్తం కార్తీ చుట్టూ తిరిగింది. ఇక రెండో పార్ట్‌లో అయితే జయం రవి, విక్రమ్‌లు క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది.

ఇక త్రిష, ఐశ్వర్య రాయ్‌లు ఈ సినిమాతో మరోసారి ట్రెండ్ అయ్యారు. త్రిష, ఐశ్వర్య లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఐశ్వర్య అందం ఏ మాత్రం తరగలేదని అంతా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో శరత్ కుమార్, శోభిత, ఐశ్వర్యా లక్ష్మీ ఇలా చాలా మంది ముఖ్య పాత్రలను పోషించారు.

Also Read : Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్

Also Read : Eesha Rebba Saree pics : చిలకపచ్చ కోక పెట్టినాది కేక.. చీరలో ఈషా రెబ్బా అదుర్స్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News