Manch Vishnu Comments: అది మెగాస్టార్‌ వ్యక్తిగతం.. నా ఒపీనియన్ చెప్పడం సరికాదు : మంచు విష్ణు

Manch Vishnu on Movie Ticket Prices issue: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంతో ఆదరిస్తునాయన్న మంచు విష్ణు.. సినిమా టికెట్స్‌ రేట్స్‌ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 02:32 PM IST
  • "మా" అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
  • "మన్యం రాజు" సినిమా పోస్టర్ల ఆవిష్కరణలో పాల్గొన్న విష్ణు
  • మూవీ టికెట్‌ రేట్స్‌ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న మా అధ్యక్షుడు
  • ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డితో చిరంజీవి భేటీ అనేది మెగాస్టార్ పర్సనల్ మీటింగ్‌
Manch Vishnu Comments: అది మెగాస్టార్‌ వ్యక్తిగతం.. నా ఒపీనియన్ చెప్పడం సరికాదు : మంచు విష్ణు

AP Cinema Ticket Rates issue: "మా" అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు (Manchu Vishnu) బాధ్యతలు చేపట్టాక చాలా రోజుల తర్వాత మళ్లీ ఆయన మీడియా ముందుకు వచ్చారు. "మా" పై ఆయన తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు.

"మన్యం రాజు" సినిమాకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ తాజాగా తిరుపతిలో (Tirupati) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "మా" అసోసియేషన్‌ తరఫున నిర్మించే "మా" బిల్డింగ్ గురించి త్వరలోనే ప్రెస్‌ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే మోహన్‌ బాబు (Mohan Babu) ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేయబోయే స్టూడియో గురించి కూడా త్వరలో వివరాలు ప్రకటిస్తామన్నారు. 

ఇక మూవీ టికెట్‌ రేట్స్‌ (Movie Ticket Rates) విషయంలో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ విషయంలో తన పర్సనల్ ఒపీనియన్ చెప్పడం సరికాదన్నారు. చిరంజీవితో (Chiranjeevi) పాటు బాలకృష్ణ అలాగే నాగార్జున, మోహన్‌బాబు, వెంకటేష్‌లాంటి లెజెండరీ నటులంతా తమకు ఆదర్శమన్నారు. 

ఇక మూవీ టికెట్స్‌ రేట్ల విషయంలో సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలంటూ మంచు విష్ణు పిలుపునిచ్చారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుగు సినీ పరిశ్రమకు (Telugu Film Industry) అండగా నిలుస్తున్నాయన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ (CM Jagan) మోహన్‌ రెడ్డితో చిరంజీవి భేటీ అనేది.. మెగాస్టార్ (Megastar) పర్సనల్ మీటింగ్‌ అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఇది అసోసియేషన్‌కు సంబంధించిన భేటీ కాదన్నారు. టికెట్స్‌ రేట్స్‌పై (Ticket Rates) గతంలో వైఎస్సార్‌‌ హయాంలో వచ్చిన జీఓపై చర్చ జరగాలన్నారు.

Also Read: JioBook Laptop Features: త్వరలోనే మార్కెట్లోకి JioBook ల్యాప్ టాప్స్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా?

Also Read: Tata Motors offers: టాటా కార్లపై రూ.60 వేల వరకు డిస్కౌంట్లు- ఆఫర్​ వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News