Agni Nakshatram Glimpse: రానా చేతుల మీదుగా అగ్ని నక్షత్రం గ్లింప్స్.. అదరకోట్టేసిందిగా!

Agni Nakshatram Glimpse Released: మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన అగ్ని నక్షత్రం సినిమా గ్లింప్స్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 14, 2023, 06:36 PM IST
Agni Nakshatram Glimpse: రానా చేతుల మీదుగా అగ్ని నక్షత్రం గ్లింప్స్.. అదరకోట్టేసిందిగా!

Agni Nakshatram Glimpse Review: మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నటిగా పలు సినిమాల్లో నటించి తన సత్తా ఏమిటో చాటిన ఆమె ఇప్పుడు అగ్ని నక్షత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు ప్రధాన పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించబోతోంది.

మంచు లక్ష్మి మొట్టమొదటిసారిగా తన తండ్రితో కలిసి సినిమా చేస్తోంది, అగ్ని నక్షత్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. ఇక రానా దగ్గుబాటి విడుదల చేసిన ఈ ఫస్ట్ గ్లింప్స్ లో మంచు లక్ష్మి ఒక పోలీస్ అధికారిణిగా కనిపిస్తోంది. ఇక ఈ గ్లిమ్స్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది అని అర్థమవుతుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీగా అనిపిస్తోంది, హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఒక మర్డర్ ను ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్గా మంచు లక్ష్మి చేసే యాక్షన్, ఆమె సినిమాలో ఉన్న సస్పెన్స్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి.

ఒక హైదరాబాదు పోలీసు అధికారి ఈ కేసు విషయంలో ఎలాంటి దర్యాప్తు చేస్తుంది ? ఎంక్వయిరీ చేసే క్రమంలో ఆమె ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అనే విషయం మీద సినిమా తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. మరోపక్క అగ్ని నక్షత్రం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసిన దగ్గుబాటి రానా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక తన చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ నేమ్స్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన మంచు లక్ష్మికి టీంకి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రధాన పాత్రధారులు కాగా విలన్ గా సముద్రఖని నటిస్తున్నారు. మలయాళ నటుడు సిద్ధిక్ తో పాటు విశ్వంత్, జబర్దస్త్ మహేష్, చిత్ర శుక్లా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డైమండ్ రత్నబాబు కథ అందించగా వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. 

Also Read: Valentine’s Day iPhone 14 Offer: 37,900కే ఐఫోన్ 14.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Also Read: Samantha visits Palani: ప్రముఖ ఆలయానికి సమంత..మెట్టుమెట్టుకూ కర్పూరం వెలిగించి మొక్కు చెల్లింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News