Dil Raju: మరోసారి మానవత్వం నిరూపించుకున్న 'మనంసైతం'.. దిల్ రాజు చేతుల మీదుగా చెక్కులు పంపిణి

Manam Saitham: సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్నోసార్లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన సంగతి తెలిసిందే. తెరపైనే కాదు తెరవెనక కూడా సినిమా సెలబ్రెటీస్ పలు సందర్భాలలో హీరోలుగా నిలిచారు. ఇలా సినిమా వారు ప్రారంభించిన ఫౌండేషన్ మనం సైతం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 04:26 PM IST
Dil Raju: మరోసారి మానవత్వం నిరూపించుకున్న 'మనంసైతం'..  దిల్ రాజు చేతుల మీదుగా చెక్కులు పంపిణి

Manam Saitham : చుట్టూ ఉన్నవారికి సహాయపడాలి అనే ధ్యేయం తో స్థాపించిన పౌండేషన్ 'మనం సైతం'. గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎంతో మందికి సాయం చేస్తోంది కాదంబరి కిరణ్ నిర్వ‌హ‌ణ‌లోని 'మనం సైతం' ఫౌండేష‌న్. ఈ నేపథ్యంలో కాదంబరి కిరణ్ ఫౌండేషన్ సారధ్యంలో ఆరుగురికి నిర్మాత దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా  చెక్కులు పంపిణి  చేశారు. త‌మ సాయం నిరంత‌రంగా కొన‌సాగుతూనే వుంటుంద‌ని తెలిపారు. 

ఫిల్మ్ చాంబర్ వేదికగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముందుగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... 'మనం సైతం' ఫౌండేషన్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి నేటి వరకు అండగా ఉంటున్న కళామాతల్లి ముద్దుబిడ్డలైన ప్రతిఒక్కరికి పాదాబివందనం. గ‌డిచిన‌ పది సంవత్సరాల కాలంలో పేదలైన సినీ కార్మికులకు కోటి రూపాయాలకు పైగా సహాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గారికి కృతజ్ఙతలు తెలిపారు. గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి  తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేదల నుంచి విజ్ఞ‌ప్తులు అందుతుండటంతో సాధ్య‌మైనంత సహాయం చేస్తున్నాం. వందలాది మంది సాయం కోసం ఎదురుచూపు..కానీ  'మనం సైతం' సేవలు తీసుకునే వారికి తొందరగా చేరుకున్నా.. దాత‌ల ద‌గ్గ‌రికి అంత తొందరగా చేరడం లేదని నా భావన.. ఇది తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు  ప్రసన్న కుమార్ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, దాము గారు, వివి వినాయక్ గారు, జయసుధ గారు తమ సహాకారం ఉంటుందని ప్రోత్సాహిస్తున్నారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చిన దిల్ రాజు, దాము, ప్రసన్న కుమార్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అవసరార్ధులకు రూ. 25 వేలు చొప్పన చెక్కుల పంపిణి అందజేయడం ఆనందగా ఉంది'' అని అన్నారు.

ఇక ముఖ్య అతిథి దిల్ రాజు  మాట్లాడుతూ.. ''దేవుడు ఉన్నాడా..? లేడా.? చర్చ రెగ్యూలర్ గా వింటూ ఉంటాం.. అది మనుషులకైతే తెలియదు.. నమ్మేవాళ్లు నమ్ముతారు... నమ్మని వాళ్లు నమ్మరు. దేవుడు మనిషి పుట్టించాడు... ఆ మనిషి ద్వారా ఎదుటి మనిషికి సాయం పొందినప్పుడే దేవుడున్నాడని నమ్ముతుంటారు.. 'మనం సైతం' సేవ కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి, మనిషికి కాదంబరి కిరణ్ ఓ వారధి.  మీ చివరి శ్వాస వరకు ఈ సేవలు కొనసాగించండి.. మీ వెనుక మేము ఉంటాం”. అన్నారు. 

నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలని ఉంటుంది.. దానికి వెనుక మరో లక్ష్యం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా అని పదేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చిన  కాదంబరి కిరణ్ అడిగాను. అలాంటిది ఏం లేదు అన్నాడు. తొమ్మిదేళ్లుగా గమనిస్తున్నాను. అ రోజు ఏదైతే చెప్పాడో అదే లక్ష్యం తో పనిచేస్తున్నారు. సహాయం చెయ్యాలని చాలా మందికి ఉంటుంది.. వారికి దగ్గరివెళ్లి డబ్బు తెచ్చి... అవసరార్ధులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం... ఇది అంతా సులువు కాదు..  ఆయనకు మా సహాకారం ఎప్పుడు ఉంటుంది'' అన్నారు. 

ఇక వీరితో పాటు దర్శకులు చంద్ర మహేష్ , ప్రేమ్ రాజ్ , సాంబశివరావు, బందర్ బాబీ,, మహనంద్ రెడ్డి, మనం సైతం సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News