Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

Malashree's daughter Radhana Ram Debut Movie Opening: అలనాటి హీరోయిన్ మాలాశ్రీ కుమార్తె రాధానా రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 08:26 PM IST
Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

Malashree's daughter Radhana Ram Debut Movie Opening: సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్. అనేక మంది అలా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటగా మరికొందరు కనుమరుగు అయ్యారు. ఇక తాజాగా మరో వారసురాలు సినీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. 

 

దివంగత రాము, సీనియర్ హీరోయిన్ మాలాశ్రీల కుమార్తె రాధనా రామ్ కన్నడలో 'చాలెంజింగ్ స్టార్' దర్శన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. D56(దర్శన్ 56) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీతో ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. 

బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఆశ్రమంలో శుక్రవారం నాడు వరమహాలక్ష్మి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రారంభమైనట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక సినిమాను ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెలుగు,కన్నడ , మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కన్నడ 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నారు.తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాలలో మాలాశ్రీ నటించారన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె భర్త, నిర్మాత రాము మరణించారు. ఇప్పుడు ఆమె కుమార్తె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. 
Also Read: NTR: ఎన్టీఆర్ ఫాన్స్ కు బాడ్ న్యూస్.. ఆ అస్వస్థతతో నాలుగు వారాలు రెస్ట్ తీసుకోమన్న డాక్టర్లు.. అసలు ఏమైందంటే?

Also Read: Gopisundar: సింగర్‌ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News