Adivi Sesh Announces 50 Percent Discount On Major Movie Tickets: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మేజర్'. టాలీవుడ్ యువ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన మేజర్ సినిమా.. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చూసి ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చూసి ప్రసంశించారు. మేజర్ సినిమా మాత్రమే కాదని, ఓ ఎమోషనల్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మేజర్ చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలి. అందుకే పాఠశాలల యాజమాన్యాలకు టికెట్ ధరపై 50 శాతం రాయితి ఇచ్చి.. ప్రత్యేకంగా షో వేస్తాం. ఇందుకోసం majorscreening@gmail.comకి మెయిల్ చేయండి' అని మేజర్ టీం పేర్కొంది.
Team #MajorTheFilm🇮🇳has some exciting news for all School children ❤️
Witness the Life of #MajorSandeepUnnikrishnan on Big Screens at 50% discount on tickets 💥💥for ALL school screenings
School management can write to majorscreening@gmail.com and register for the special show. pic.twitter.com/GhuwfrxAaX
— Adivi Sesh (@AdiviSesh) June 14, 2022
ఇదే విషయాన్ని హీరో అడివి శేష్ కూడా తన ట్వీటర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. 'మేజర్ సినిమాను ఇంతపెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలామంది చిన్నారులు నాకు ఫోన్ చేసి.. మేజర్ సందీప్‌లా దేశం కోసం తాము కూడా పోరాడతామని అంటున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. చిన్నారుల కోసం గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ ఇస్తున్నాం. మేజర్ గురించి రేపటి తరానికి తెలియాలన్నదే మా లక్ష్యం' అని అడివి శేష్ చెప్పుకొచ్చారు.
Also Read: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ ప్లేట్లు తప్పనిసరి! పాత వాహనాలకు కూడా
Also Read: కశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యలకు తేడా ఏముంది.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook