MAA Elections polling: ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా - బాలకృష్ణ

prakash raj and vishnu are like ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని బాలకృష్ణ అన్నారు. మా సభ్యులకు, సినీ ఇండస్ట్రీకి ఎవరు బాగా చేస్తారో వాళ్లకే తాను ఓటు వేశానని స్పష్టం చేశారు బాలయ్య.

Last Updated : Oct 10, 2021, 12:29 PM IST
  • మా ఎన్నిక‌ల‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నందమూరి బాల‌కృష్ణ‌
  • ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారు
  • సినీ ఇండస్ట్రీకి ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా : బాల‌కృష్ణ‌
MAA Elections polling: ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా - బాలకృష్ణ

MAA Elections 2021 polling balakrishna says prakash raj and vishnu are like brothers: హోరా హోరీగా సాగుతున్న మా ఎన్నిక‌ల‌లో (MAA Elections ) పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓటు వేసేందుకు చిన్న‌, పెద్ద స్టార్స్ అంద‌రూ పోలింగ్ బూత్‌కి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ స్టార్స్ ఓటు వేశారు. హీరో నందమూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balakrishna) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన త‌ర్వాత బాల‌కృష్ణ‌ మాట్లాడారు. మా ఎన్నికల్లో గతంలో ఇంత హడావుడి లేదన్నారు.

Also Read : MAA Elections polling: మా ఎన్నికల్లో ఉద్రిక్తత.. శివబాలాజీ చెయ్యి కొరికిన హేమ

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని బాలకృష్ణ (Balakrishna) అన్నారు. మా సభ్యులకు, సినీ ఇండస్ట్రీకి ఎవరు బాగా చేస్తారో వాళ్లకే తాను ఓటు వేశానని స్పష్టం చేశారు బాలయ్య. రెండు ప్యానెళ్ల సభ్యుల ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారన్నారు. అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, (prakash raj) మంచు విష్ణు ( manch vishnu) .. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసేవాళ్లే అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటామన్నారు ఆయన. ‘మా’ (MAA) అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమని.. ఎవరు గెలిచినా వారి వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. మా ఎన్నికలు (MAA Elections) ముగిశాక మళ్లీ అందరం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పారు. సినీ పరిశ్రమలో వర్గాలు అనేవి లేవన్నారు. అందరం కలిసే ఉంటామని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. 

Also Read : Rigging in MAA Elections: మా అసోసియేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్, నిలిచిన పోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News