Pradeep Ranganathan Facebook : డైరెక్టర్ కమ్ హీరోకి చిక్కులు.. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్?.. వెంటాడుతున్న పోస్ట్‌లు

Pradeep Ranganathan Facebook ప్రదీప్ రంగనాథన్ ఫేస్ బుక్ ఓల్డ్ పోస్టుల మీద ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలోకి రాకముందు, అంతగా ఊహ తెలియని సమయంలో వేసిన పోస్టులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 11:58 AM IST
  • కోలీవుడ్‌లో లేటెస్ట్ సంచలనం
  • బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లవ్ టుడ్
  • డైరెక్టర్ కమ్ హీరోకి చిక్కులు
Pradeep Ranganathan Facebook : డైరెక్టర్ కమ్ హీరోకి చిక్కులు.. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్?.. వెంటాడుతున్న పోస్ట్‌లు

Love Today Director Pradeep Ranganathan : సోషల్ మీడియాలో జనాలు ఎంత స్పీడుగా, ఎంత యాక్టివ్‌గా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో మనం గతంలో వేసిన పోస్టును కూడా బయటకు తవ్వి తీసి.. ఇప్పుడు ట్రెండ్ చేస్తుంటారు. సినిమా తారల విషయంలో అయితే జనాలు ఇంకా ఎంతో ఫోకస్‌ పెడుతుంటారు. ఇప్పుడు డైరెక్టర్ కమ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథన్‌కు అలాంటి చిక్కులే వచ్చాయి. గతంలో ప్రదీప్ వేసిన పోస్టులు, సెలెబ్రిటీల మీద చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన మెడకు చుట్టేస్తున్నాయి.

 

కోమలి సినిమాతో ప్రదీప్ పేరు కోలీవుడ్‌లో మార్మోగిపోయింది. మరోసారి లవ్ టుడ్ సినిమాతో దర్శకుడిగా, హీరోగా ప్రదీప్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ సారి కోలీవుడ్‌తో పాటుగా టాలీవుడ్లోనూ ప్రదీప్ ట్రెండ్ కాబోతోన్నాడు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ఈ క్రమంలో ప్రదీప్ పేరు కాంట్రవర్సీలో చిక్కకుంది.

గతంలో ప్రదీప్ తన ఫేస్ బుక్ ఖాతాలో యువన్ శంకర్ రాజా ఫ్రాడ్ అని, కమల్ హాసన్ విజయ్‌ల మీద నెగెటివ్ కామెంట్లు చేయడం, సచిన్ ధోనీల మీద నెగెటివ్ కామెంట్లు చేస్తూ వేసిన పోస్టులు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రదీప్‌ను అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ప్రదీప్ ఈ విషయం మీద స్పందించాడు.

ఫేస్ బుక్‌లో నేను గతంలో చేసిన పోస్టులు నిజమే..అప్పుడేదో ఆ వయసులో తెలియకుండా చేశాను.. నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఉంటున్నాను.. ఇలా ట్రోల్స్ చేస్తున్న వారిని నేనేమీ తప్పు పట్టను. వీటి వల్ల నన్ను ఎంతగానో ప్రేమించేవారు కూడా ఉన్నారని తెలిసింది.. నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ.. ప్రతీ రోజు ఓ బెటర్ పర్సన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ ట్వీట్ వేశాడు. అయితే ప్రదీప్ తన ఫేస్ బుక్ ఖాతాను డీ యాక్టివ్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read : Hyper Aadi Remuneration : ఆది రెమ్యూనరేషన్.. రష్మీ ఇంటి గుట్టు.. నరేష్ లోపం.. మల్లెమాల మారని తీరు

Also Read : Bigg Boss Keerthi : ఇంకా తత్త్వం బోధపడనట్టుందిగా.. శ్రీహాన్ అతికి మూల్యం తప్పదు.. కీర్తి విషయంలో మారని సత్య

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News