Love Me If You Dare OTT Release: ఈ మధ్యకాలంలో చాలా వరకు చిన్న సినిమాలు.. థియేటర్లో విడుదలైన కొద్ది రోజులకే ఓటిటిలో ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. కనీసం నెల రోజులు కూడా గ్యాప్ లేకుండా.. చాలావరకు సినిమాలు ఈమధ్య థియేటర్లలో.. విడుదలైన కొద్ది రోజులకే ఓటిటిలో.. కూడా విడుదల అయిపోతున్నాయి.
అయితే ఎంత త్వరగా విడుదలవుతున్నా.. కూడా చాలా వరకు చిత్ర దర్శక నిర్మాతలు.. తమ సినిమా ఓటిటిలలో విడుదల అవుతుంది అని కూడా ప్రమోషన్లు చేస్తారు. కనీసం సోషల్ మీడియాలో ..అయినా సినిమా ఓటిటి విడుదల.. గురించి అధికారికంగా ప్రకటిస్తారు. కానీ ఈమధ్య అలాంటి అధికారిక ప్రకటన కూడా.. ఇవ్వకుండా విడుదల చేసేస్తున్నారు.
కృష్ణమ్మ, గ్యంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలు విడుదలైన రెండు వారాలకే ఓటీటిలలో విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ మధ్యనే విడుదలైన ఒక చిన్న సినిమా చాలా సైలెంట్ గా.. ఎటువంటి హడావిడి లేకుండానే ఓటిటిలో విడుదలైపోయింది. అదే లవ్ మీ.. ఇఫ్ యు డేర్.
బేబీ సినిమాతో పాపులర్ అయిన.. షార్ట్ ఫిలిం బ్యూటీ వైష్ణవి చైతన్య.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు బంధువు ఆశిష్..ఈ సినిమాలో హీరోగా చేశారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. అయితే ఎంత ఫ్లాప్ సినిమా అయినప్పటికీ..విడుదలై కనీసం నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఎటువంటి అప్డేట్ కూడా లేకుండా సడన్ గా ..అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ ప్రత్యక్షమైంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, ఆశిష్ అనే వ్యక్తి.. ఎవరైనా దెయ్యాలు ఉన్నాయని చెబితే అక్కడికి వెళ్లి అక్కడ ఎటువంటి దెయ్యాలు లేవని నిరూపిస్తూ ఉంటాడు. తనకి సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో.. పెట్టి ఫేమస్ అవుతాడు. అతనికి తన తమ్ముడు ప్రతాప్ అతని గర్ల్ ఫ్రెండ్ ప్రియా సహాయం చేస్తూ ఉంటారు. ఒకరోజు ప్రియా.. ఆశిష్ కి దివ్యవతి అనే దెయ్యం గురించి చెబుతుంది. ఆ దెయ్యం సంగతి తెలుసుకోవాలని ఆశిష్ తెలంగాణ కర్ణాటక బోర్డర్ లో ఉండే ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. కానీ ఆ దెయ్యాన్ని చూసిన ఆశిష్ ఆ దయ్యం తోనే ప్రేమలో పడతాడు. ఇంతకీ అసలు ఈ దివ్యవతి ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఆశిష్ నిజంగా ఆమెనే ప్రేమిస్తున్నాడా? చివరికి ఏమైంది అనేది సినిమా కథ.
రవి కిషన్, సిమ్రాన్ చౌదరి, సంయుక్తాలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ పనిచేశారు. ఇక ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
Also Read: Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్.. పూల బొకేలు తిరస్కరణ
Also Read: Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్.. ఊపిరి పోసుకున్న అమరావతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter