Liger Movie: పూరీ, ఛార్మీలకు లైగర్ కొత్త కష్టాలు, ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు నిర్మాతలు

Liger Movie: అసలే సినిమా ఫ్లాప్‌తో నష్టాలెదుర్కొంటున్న పూరీ జగన్నాధ్, ఛార్మీలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. లైగర్ సినిమా పెట్టుబడుల విషయమై..ఇద్దరూ ఈడీ విచారణకు హాజరయ్యారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 17, 2022, 10:02 PM IST
  • లైగర్ సినిమా ఫ్లాప్‌కు తోడు నిర్మాతలు పూరీ జగన్నాధ్, ఛార్మీలకు కొత్త కష్టాలు
  • లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాధ్, ఛార్మీలు
  • 15 రోజుల ముందే నోటీసులు, ఉదయం నుంచి విచారణ ఎదుర్కొంటున్న పూరీ జగన్నాధ్, ఛార్మీ
Liger Movie: పూరీ, ఛార్మీలకు లైగర్ కొత్త కష్టాలు, ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు నిర్మాతలు

విజయ్ దేవరకొండ హీరోగా భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాగా విడుదలైన లైగర్ ఫ్లాప్ ముటగట్టుకుంది. ఈ ఫ్లాప్‌తో నష్టాలెదుర్కొంటున్న చిత్ర నిర్మాతలు పూరీ జగన్నాధ్, ఛార్మీలకు కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై విడుదలైన లైగర్ సినిమా భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. ఇప్పుడీ సినిమా నిర్మాతలైన పూరీ జగన్నాథ్ , ఛార్మీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. విచారణకు హాజరుకావల్సిందిగా 15 రోజుల క్రితమే నోటీసులు జారీ అయ్యాయి. లైగర్ సినిమా ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించేందుకు ఈడీ విచారణ ప్రారంభించింది. లైగర్ సినిమా పెట్టుబడుల విషయమై విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సమీకరించారు. 

లైగర్ సినిమాలో రాజకీయ నతలు పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే 15 రోజుల క్రితమే విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులందుకున్న విషయాన్ని బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. ఇవాళ ఉదయం ఈడీ కార్యాలయంలో ఉదయం నుంచి పూరీ జగన్నాథ్, ఛార్మీలను ఈడీ విచారిస్తూ..ప్రశ్నలు కురిపిస్తోంది. 

Also read: Dhanush Movie: తమిళ స్టార్ నటుడు ధనుష్ కొత్త సినిమా సర్ విడుదల ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News