Kriti sanon Adipurush ప్రభాస్ ఓం రౌత్ కాంబోలో రాబోతోన్న ఆదిపురుష్ సినిమా మీద ఇప్పుడున్న బజ్ అందరికీ తెలిసిందే. ఆదిపురుష్ నుంచి టీజర్ రాక ముందు ఒక లెక్క.. రిలీజ్ అయిన తరువాత ఒక లెక్క అన్నట్టుగా మారింది. ఆదిపురుష్ టీజర్ చూసి అందరూ తిట్టడం ప్రారంభించారు. ఈ ట్రోలింగ్‌ను ఓం రౌత్ తట్టుకోలేకపోయాడు. మొదట్లో కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది త్రీడీలో తీశామని, మొబైల్ ఫోన్లో చూసేందుకు కాదని, థియేటర్లో చూడాల్సిన సినిమా అని ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.
కానీ చివరకు ఓం రౌత్ తన తప్పులు తెలుసుకున్నాడు. విజువల్స్, ప్రభాస్ గెటప్, సైఫ్ అలీఖాన్ లుక్స్, ఆంజనేయుడి పాత్రను చూపించిన తీరు మీద జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు, రావణుడు, వానర సేన ఇలా ఉంటారా? అంటూ నానా రకాలుగా తిట్టేశారు. దీంతో అన్నీ రిపేర్లు చేసేందుకు ఓం రౌత్ సిద్దమయ్యాడు.
అందుకే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. ఆదిపురుష్ సినిమా మీద నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ సీజీ, వీఎఫ్ఎక్స్ పనులను చేస్తున్నారట. ఈ విషయాన్ని ఇప్పుడు కృతి సనన్ కూడా చెప్పేసింది. ఆదిపురుష్ మీద మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ టీజర్ మీద ఇలాంటి కామెంట్లు వస్తాయని, ఇంతలా ట్రోలింగ్ జరుగుతుందని అస్సలు ఊహించలేదట. వాటిని చూసి ఎంతో బాధపడిందట. అయితే ఇప్పుడు సినిమాలో మార్పులు చేస్తున్నారని కృతి సనన్ తెలిపింది. ఈ మూవీ టైంలోనే ప్రభాస్, కృతి సనన్ల మధ్య మంచి బంధం ఏర్పడిందని, అది ప్రేమకు దారి తీసిందని, పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ప్రేమ, పెళ్లి, డేటింగ్ వార్తలను కృతి సనన్, ప్రభాస్‌లు ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇక ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ భారీ ఎత్తున నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రిపేర్లకు కూడా భాగానే ఖర్చు పెడుతోందట.
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: SSMB 28 Look : మహేష్ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook