Krishnam Raju Pet: కృష్ణంరాజు మృతితో ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Krishnam Raju Pet Consoling His Wife Shyamala Devi In Tragedy: కృష్ణంరాజు గారు లేని లోటు తలుచుకుంటూ తాను ఏడుస్తుంటే జింజర్ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 23, 2022, 01:41 PM IST
Krishnam Raju Pet: కృష్ణంరాజు మృతితో ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Krishnam Raju Pet Consoling His Wife Shyamala Devi In Tragedy: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అయోధ్య రామ మందిర నిర్మాణం దగ్గరలో చేయాలని కృష్ణంరాజు కోరుకున్నారని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పేర్కొన్నారు. ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర నాయకులు కృష్ణంరాజు నివాసానికి వెళ్లి కృష్ణంరాజు భార్య, పిల్లలను పరామర్శించారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు భార్య శ్యామల మాట్లాడుతూ ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించే విజయదశమి వేడుకకు కృష్ణంరాజుతో  గారితో పాటు ప్రభాస్ ను కూడా నరేంద్ర మోడీ ఆహ్వానించారని ఆమె కీలక విషయాన్ని బయటపెట్టారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సినీ హీరో అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారని ఆమె గుర్తు చేశారు.

కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కాకినాడ, నర్సాపురంతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు కృష్ణంరాజు చాలా సేవ చేశారని, పల్లె పల్లెకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన తన స్వగ్రామం మొగల్తూరులో సంస్కరణ స్మభా నిర్వహిస్తున్నామని ఈ సభకు లక్షలాదిగా కృష్ణంరాజు అభిమానులు, బిజెపి కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని అన్నారు. తాము ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్క జింజర్ కృష్ణంరాజు గారితో చాలా సన్నిహితంగా ఉండేదని ఏడేళ్ల క్రితం తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దానిని ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చారని శ్యామలాదేవి వెల్లడించారు.

కృష్ణంరాజు గారు లేని లోటు తలుచుకుంటూ తాను ఏడుస్తుంటే జింజర్ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు భార్యను, కుమార్తెలను పరామర్శించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో తయారు చేయబడిన కృష్ణంరాజు విగ్రహానికి కూడా వారు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

Also Read: Shaakuntalam Release Date: అవన్నీ పుకార్లే.. సమంత విషయంలో గుడ్‌న్యూస్‌ చెప్పిన దిల్ రాజు!

Also Read: Sree Leela out of DJ Tillu 2: డీజే టిల్లు 2 నుంచి శ్రీలీల ఔట్.. ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News