King Nagarjuna: హిమాలయాల్లో నాగ్ వైల్డ్ డాగ్ షూట్... లోకేషన్ చూశారా ?

కింగ్ అక్కినేని నాగార్జున ( Nagarjuna ) ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

Last Updated : Oct 23, 2020, 10:50 PM IST
    • కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
    • అడ్వెంచర్ మూవీ అయిన వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాను అని తెలిపాడు నాగార్జున.
    • ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ట్వీట్ చేసి అభిమానులతో షేర్ చేశారు.
King Nagarjuna: హిమాలయాల్లో నాగ్ వైల్డ్ డాగ్ షూట్... లోకేషన్ చూశారా ?

కింగ్ అక్కినేని నాగార్జున ( Nagarjuna ) ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అడ్వెంచర్ మూవీ అయిన వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాను అని తెలిపాడు నాగార్జున. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ట్వీట్ చేసి అభిమానులతో షేర్ చేశారు. అప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 4లో భాగంగా ఈ వారం నాగ్ కనిపిస్తాడు అనుకున్నవారికి ఈ వీడియో ఆశ్చర్యంగా అనిపించింది.

Read Also | Rashmi Gautam: యాంకర్ రష్మీ కి కరోనా..

ఈ వీడియోలో నాగార్జున తను రోహ్తాంగ్ పాస్ లో ( Rohtang Pass ) ఉన్నాను.. ప్రస్తుతం 13000 అడుగుల ఎత్తులో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉన్నాను అని తెలిపాడు. ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైనది అని నవంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఉంచుతారు అని తెలిపాడు. ఇక్కడ మరో 21 రోజుల పాటు షూటింగ్ చేస్తాను అని తెలిపాడు నాగ్. 

Read Also| NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య

ఏడునెలల గ్యాప్ తరువాత ఇలా.. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపాడు నాగ్. వైల్డ్ డాగ్ ( Wild Dog Movie ) మూవీని సోలోమెన్ తెరకెక్కిస్తున్నాడు.  ఇందులో దియా మిర్జా, సైయామీ ఖేర్ కూడా నటిస్తున్నారు. ఈమూవీలో నాగ్ NIA అధికారిగా నటిస్తున్నాడు. హిమాలయ షెడ్యూల్ తరువాత నాగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షూటింగ్ లో మళ్లీ చేరనున్నాడు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News