KGF 2: కేజీఎఫ్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. జీ తెలుగులో ఎప్పుడంటే?

KGF 2 World Television Premiere Date: ఈ ఏడాది విడుదలైన అతి భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి అయిన కేజీఎఫ్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దమైంది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 07:26 AM IST
KGF 2: కేజీఎఫ్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. జీ తెలుగులో ఎప్పుడంటే?

KGF 2 World Television Premiere Date: జీ తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే వరుస టెలివిజన్ ప్రీమియర్స్ తో సరికొత్త సినిమాలను మీ ముందుకు తీసుకొస్తున్న జీ తెలుగులో ఇక కేజిఎఫ్ 2 సినిమా సందడి చేయబోతోంది. కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టిందని ట్రేడ్ వర్గాల వారు అంచనాలు వేస్తున్నారు. ఇక ఇలాంటి భారీ మూవీ టెలివిజన్ ప్రీమియర్ కి రంగం సిద్ధమైంది. ఆగస్టు 21వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ సినిమా జీ తెలుగులో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఇక ప్రకాష్ రాజు, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుని అంతా తనదే అని భావిస్తున్న రాఖీకి ఒకపక్క అధీరా మరోపక్క రమికా సేన్ రూపంలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతాయి. వారి మధ్య జరిగే సన్నివేశాలు అన్నీ కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ప్రకటిస్తూ జీ తెలుగు ఒక ఆసక్తికరమైన ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా శ్రీకారం చుట్టింది .

తాజాగా 100 అడుగుల కేజిఎఫ్ చాప్టర్ 2 పోస్టర్ని హైటెక్ సిటీలోని శిల్పారామం సమీపంలో క్లౌడ్ డైనింగ్ నుంచి మీడియా సహా ప్రేక్షకుల సమక్షంలో రివీల్ చేసి ఒక అద్భుతమైన ఫీట్ కూడా సాధించింది. బాహుబలి తర్వాత దేశంలో భారీ కలెక్షను సాధించిన సినిమాగా  కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా నిలుస్తోంది. అలాంటి సినిమా జీ తెలుగులో ప్రసారం కానుండడంతో ప్రేక్షకులందరూ ఆ సినిమాను వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.

Also Read: Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే?

Also Read: Ranveer Singh: న్యూడ్ ఫోటోషూట్ వివాదం.. రణవీర్ ఇంటికి పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News