Kantara IMDB Rank: దటీజ్ కాంతారా.. దెబ్బకు ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ అవుట్.. చివరకు బాహుబలి కూడా

Kantara Movie Grabs number one కాంతారా చిత్రం ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రం.. ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 01:40 PM IST
  • దేశమంతటా కాంతారా సంచలనాలు
  • కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కాంతారా
  • ఐఎండీబీ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్
Kantara IMDB Rank: దటీజ్ కాంతారా.. దెబ్బకు ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ అవుట్.. చివరకు బాహుబలి కూడా

Kantara Movie IMDB Rank : కాంతారా సినిమాకు ప్రస్తుతం అందరూ ఫిదా అవుతున్నారు. కాంతారా చిత్రానికి వచ్చినంత మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ టాక్ మరే చిత్రానికి కూడా రాలేదు. ఈ మధ్య కాలంలో కాంతారా చిత్రం అందరినోళ్లలో నానుతోంది. కన్నడలో ప్రభంజనం సృష్టించిన కాంతారా చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కాంతారా దెబ్బకు అన్ని ఇండస్ట్రీలు షాక్ అవుతున్నాయి. రిషభ్ శెట్టి నటన, డైరెక్షన్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

రిషభ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా చిత్రం ఇప్పుడు కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కన్నడలో వంద కోట్లు కలెక్ట్ చేసిన అతి కొద్ది చిత్రాల్లో కాంతారా నిల్చుంది. కాంతారా దెబ్బకు కేజీయఫ్ రికార్డులు సైతం బద్దలయ్యాయి. కన్నడలో ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లు కొల్లగొట్టేసింది. పైగా ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. కనీసం ఇరవై కోట్లు కూడా పెట్టని ఈ సినిమాకు కేవలం కన్నడలోనే వంద కోట్లు వచ్చాయి.

ఇప్పుడు తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం కలెక్షన్ల వర్షంకురిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో పదిహేను కోట్ల గ్రాస్ వరకు చేరుకుంది. హిందీలో ఆల్రెడీ పది కోట్ల షేర్ రాబట్టేసింది. ఇలా అన్ని చోట్లా కాంతారా చిత్రం దూసుకుపోతోంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డును బ్రేక్ చేసింది. ఇండియన్ మూవీ డేటా బేస్.. ఐఎండీబీలో కాంతారా చిత్రం నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. టాప్ 200 సినిమాల్లో.. కాంతారా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. కేజీయఫ్ 128, ఆర్ఆర్ఆర్ 190, బాహుబలి 101వ స్థానంలో ఉన్నాయి. అలా ఈ చిత్రాలన్నింటిని కాంతారా వెనక్కి నెట్టేసింది. మున్ముందు ఈ సినిమా కలెక్షన్లలో కూడా వెనక్కి నెట్టేసేలా కనిపిస్తోంది.

Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే

Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News