ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం: కంగనా షాకింగ్ కామెంట్స్

ChaySam Divorce: అక్కినేని నాగచైతన్య-సమంత జంట.. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు అక్టోబర్​ 2న సంయుక్తంగా ప్రకటించారు. దీనిపై బాలీవుడ్ నటి కంగన రనౌత్  షాకింగ్​ కామెంట్స్ చేసింది. వారిద్దరూ విడిపోవడానికి ఓ బాలీవుడ్​ స్టార్​ కారణమని ఇన్​స్టా​లో పోస్ట్​ చేసింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 12:59 PM IST
  • చై-సామ్ విడాకులపై కంగనా షాకింగ్ కామెంట్స్
  • ఆ బాలీవుడ్ స్టారే కారణమన్న కంగనా
  • అక్టోబరు2న విడిపోయిన నాగచైతన్య-సమంత జంట
ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం: కంగనా షాకింగ్ కామెంట్స్

ChaySam Divorce: టాలీవుడ్‌ స్టార్‌ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకులు(ChaySam Divorce) ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చై-సామ్ జంట.. విడిపోవడం అటు అక్కినేని అభిమానులకు, ఇటు సామ్‌(Samantha) ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా(Social Media) వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ తమకు ఇష్టమొచ్చిచ్చినట్లుగా విశ్లేషణ చేస్తున్నారు.

కంగనా షాకింగ్ పోస్ట్
అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌  కంగనా రనౌత్‌(Kangana Ranaut) మరో ఆసక్తికర చర్చకు తెర తీసింది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే కారణమంటూ షాకింగ్‌ పోస్ట్‌ చేసింది. ‘10 ఏళ్లుగా ప్రేమ బంధంలో ఉండి, నాలుగేళ్లుగా వివాహా బంధంలో ఉండి.. విడాకులు తీసుకున్న ఓ సౌత్‌ ఇండియా హీరో.. ఇటీవల బాలీవుడ్‌(Bollywood)కు చెందిన ఓ స్టార్‌ హీరోతో పరిచయమ్యారు. ఆ బాలీవుడ్‌కు హీరో విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుంది. అతను ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఆయన సూచనలు, సలహాల మేరకే సౌత్‌ హీరో విడాకుల నిర్ణయం తీసుకున్నాడు’అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో కామెంట్‌ చేసింది.

Also Read: Nagarjuna reacts to Samantha's divorce: సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది ‌‌- నాగార్జున

దీంతో పాటు  ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై కూడా కంగనా కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan)ను ఉద్దేశించే కంగనా ఆ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కాగా, నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి 'లాల్‌ సింగ్ చద్దా' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా, కొద్ది రోజుల క్రితమే ఆమిర్​ కూడా తన రెండో భార్యకు విడాకులిచ్చారు. 

సిద్ధార్థ్ ట్వీట్ వైరల్..
చైసామ్(chaysam)​ జంట విడిపోవడంపై నటుడు సిద్ధార్థ్(Siddharth)​ కూడా స్పందించాడు. 'స్కూల్​లో నేను నేర్చుకున్న మొదటి పాఠం.. మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు, వాళ్ల జీవితం అంతే' అని ట్వీట్​ చేశాడు. అయితే.. సిద్ధార్థ్​ ఎవరు పేరూ చెప్పనప్పటికీ.. అది సమంతను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సిద్ధార్థ్​-సామ్​ ప్రేమించుకున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News