Kangana Ranaut First look: చంద్రముఖి 2 గా కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్ అద్దిరిపోయిందిగా

Kangana Ranaut First look: చంద్రముఖి సినిమా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేని పేరు. చంద్రముఖి పేరు గుర్తొస్తే చాలు లక లక లక గుర్తుకు రావల్సిందే. చాలాకాలం తరువాత ఇప్పుడు చంద్రముఖి 2 సీక్వెల్ సిద్ధమౌతోంది.ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2023, 01:20 AM IST
Kangana Ranaut First look: చంద్రముఖి 2 గా కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్ అద్దిరిపోయిందిగా

Kangana Ranaut First look: చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 ఫస్ట్‌లుక్ అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. చంద్రముఖిగా నటిస్తన్న కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్‌లో అదరగొట్టేసింది. మళ్లీ మళ్లీ చూడాలన్పించేలా ఆకట్టుకుంటోంది. చంద్రముఖిగా కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

చంద్రముఖి 2తో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ సిద్ధమైంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో వస్తున్న చంద్రముఖి 2లో ఇప్పటికే రాఘవ లారెన్స్ ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇప్పుడు చంద్రముఖి 2 పాత్రలో కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్ విడుదలవడంతోనే వైరల్ కాసాగింది. పట్టు చీరలో రాజనర్తకిగా కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. నడుముకి వడ్డాణం,  మెడకు అద్దిన హారం, పాపిటబిళ్లతో అద్బుత సౌందర్య రాశిగా కన్పిస్తున్న కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. చంద్రముఖిగా అప్పుడు జ్యోతిక భయపెడితే ఇప్పుడు కంగనా రనౌత్ ఆకట్టుకుంటోంది. 

అప్పట్లో అంటే 2005లో రజనీకాంత్, జ్యోతిక, నయనతార నటించిన చంద్రముఖి 1 సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 9 కోట్లతో నిర్మితమైన సినిమాకు 70 కోట్ల వసూళ్లు వచ్చింది. ఇప్పట్లో ఇది భారీ కలెక్షన్. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత చంద్రముఖి 2 తెరకెక్కింది. వినాయక చవితి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Also read: Jawan Movie: గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్‌ న్యూ లుక్‌.. మీరు ఓ లుక్కేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News