Kamal Haasan Surprises DSP : దేవీ శ్రీ ప్రసాద్‌కు కమల్ హాసన్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ స్టైల్లో లోకనాయకుడు

Kamal Haasan Surprise Gift To Devi Sri Prasad దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతున్నా కూడా పుష్ప పాత్రం డీఎస్పీని ఎక్కడో తీసుకెళ్లి పెట్టింది. పుష్ప పాటలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాయి. కమల్ హాసన్‌కి సైతం పుష్ప పాటలు ఎక్కేశాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 09:02 AM IST
  • దేవీ శ్రీ ప్రసాద్‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్
  • డీఎస్పీని ఆశ్చర్యపరిచిన కమల్ హాసన్
  • నా బిడ్డ.. నీ అడ్డా అంటూ కమల్
Kamal Haasan Surprises DSP : దేవీ శ్రీ ప్రసాద్‌కు కమల్ హాసన్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ స్టైల్లో లోకనాయకుడు

Kamal Haasan Surprise Gift To Devi Sri Prasad దేవీ శ్రీ ప్రసాద్ కెరీర్ అయిపోయింది.. ఇక తమన్ శకం మొదలైందని అనుకునే సమయంలో పుష్ప అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట్లో పుష్ప పాటల మీద కూడా ట్రోలింగ్ వచ్చింది. కానీ పుష్ప సినిమా క్రియేట్ చేసిన వండర్స్‌, సాంగ్స్‌ను పిక్చరైజ్ చేసిన విధానం ఇలా అంతా కలిసి వరల్డ్ చార్ట్ బస్టర్ లిస్ట్లో అల్లు అర్జున్ పుష్ప పాటలు నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఊపందుకున్నాయి.

పుష్ప పాటలే ఇప్పుడు డీఎస్పీని నిలబెట్టాయి. అయితే తాజాగా కమల్ హాసన్‌ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడట. అది మ్యూజిక్ భాషలో ఉంది. అదేంటో అర్థం కావడం లేదు గానీ.. డీఎస్పీ రాసిన ఎమోషనల్ పోస్ట్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నా బిడ్డ.. ఇది నీ అడ్డా అంటూ కమల్ హాసన్ సైన్ చేసిన నోట్ బుక్‌ను దేవీ శ్రీ ప్రసాద్ షేర్ చేశాడు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

2022 నుంచి మరో మంచి మెమోరీ.. అమెరికా నుంచి మన లోకనాయకుడు కమల్ హాసన్ సర్ నాకు ఈ గిఫ్ట్‌ను పట్టుకొచ్చారు.. నా మీదున్న ప్రేమతోనే ఇలా తీసుకొచ్చారు.. చేతితో తయారు చేసిన పుస్తకం, అందులో మ్యూజిక్ నొటేషన్స్.. కవర్ మీద ఆయన మాటలు, సంతకం ఉన్నాయి..

నా బిడ్డ.. ఇది మీ అడ్డా.. అంటే.. మై కిడ్.. దిజ్ ఈజ్ యువర్ అడ్డా అని అర్థం. పుష్ప లైన్స్‌ను నాకోసం ఇలా వాడారు.. నేనెంత అదృష్టవంతుడ్ని.. నా మీద ప్రేమ, నమ్మకాన్ని చూపిస్తున్నందుకు థాంక్యూ సర్.. ఆయన కొత్త కారులోనే నేను ఇలా ఆయనతో పాటుగా ఫోటో దిగాను.. అందులో అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉందంటూ దేవీ శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News