Bimbisara OTT Release: జీ5లో కళ్యాణ్ రామ్ 'బింబిసార'... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Bimbisara OTT Release: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచిన బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం జీ5లో రిలీజ్ కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2022, 03:58 PM IST
Bimbisara OTT Release: జీ5లో కళ్యాణ్ రామ్ 'బింబిసార'... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Bimbisara OTT Release date Announced: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన సినిమా 'బింబిసార' (Bimbisara). వశిష్ఠ మల్లిడి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఇరగదీశాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5 తేదీన రిలీజై.. బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ.75కోట్లు రాబట్టింది. చాలా కాలంగా హిట్స్ లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ వచ్చింది. బింబిసార మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపావళి కానుకగా అక్టోబరు 21 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బింబిసార చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు కథానాయికలుగా నటించారు.  ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలకపాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణీ సంగీతం అందించారు. థియేటర్లలో అలరించిన బింబిసార.. ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. 

Also Read: Oke Oka Jeevitham OTT Release: శర్వానంద్ 'ఒకే ఒక్క జీవితం' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News