Kalyan Ram Thanks Note After Bimbisara Success: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మూవీ మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమా మొదటి రోజు సుమారు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోని అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించగా సినిమాలో క్యాథరిన్ తెరెసా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సంబంధించి ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా పరిశ్రమ నుంచే కాక సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా సినిమా మీద కురుస్తున్న ప్రేమను చూసి కళ్యాణ్ రామ్ థాంక్స్ చెప్పారు. థాంక్స్ చెబుతూ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు.
2019లో, మేము బింబిసార కోసం పని చేయడం ప్రారంభించినప్పుడు, ఈప్రాజెక్ట్‌ను ప్రారంభించి, ఈ అద్భుతమైన కథను ప్రపంచానికి తెలియజేయడానికి చాలా ఉత్సుకతతో ఉన్నామని ఆయన అన్నారు. కానీ కోవిడ్ ఎంట్రీ పలు వేవ్స్, లాక్‌డౌన్‌ల కారణంగా ఆ ఉత్సాహం వెంటనే టెన్షన్‌గా మారిందని అన్నారు. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో మేము సినిమా ప్రేమికులందరికీ గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని అందించాలని కోరుకున్నామని అన్నారు. విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉందన్న ఆయన సినీ మిత్రులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రేమికులకు మరియు నా ప్రియమైన నందమూరి అభిమానులందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. బింబిసార విజయం మొత్తం చలన చిత్ర పరిశ్రమ విజయం అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.
Also Read: Pruthvi Raj: జనసేనకు జైకొట్టిన పృథ్వీరాజ్.. ఆరోజే పవన్ సమక్షంలో చేరిక?
Also Read: Bimbisara Collections: దుమ్మురేపిన కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ లో సగం టార్గెట్ పూర్తి చేసిన బింబిసార
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Kalyan Ram: ఈ విజయం మాది కాదు.. యావత్ తెలుగు సినీ పరిశ్రమది!