Kalyan Ram Devil : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి

Kalyan Ram :వైవిద్యమైన చిత్రాలను ఎన్నుకోవడంలో ఎప్పుడూ ముందు ఉండే కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో వైవిద్యమైన సినిమా డెవిల్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచే ఈ చిత్రంపై అంచనాలను పెంచుతూ వచ్చింది. ఇక ఎప్పుడు విడుదలైన మరో పోస్టర్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచుతోంది. అందుకు ముఖ్య కారణం ఈ పోస్టర్ లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి కనిపించడం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 07:02 AM IST
Kalyan Ram Devil : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి

Kalyan Ram Devil :వైవిద్యమైన కథలను ఎంచుకొని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అల్లరించడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందర ఉంటారు. ఈ మధ్య బింబిసారా తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత వచ్చిన అమిగోస్ తో ఒక యావరేజ్ హిట్ సొంతం చేసుకున్నారు. 

ఇక ఈ సినిమా తరువాత ఇప్పుడు డెవిల్ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో మనం ముందుకు రాబోతున్నారు. 
స్పై థ్రిల్లర్ గా రాబోతున్న డెవిల్ సినిమాకు ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైన దగ్గర నుంచే ఈ చిత్రంపై అంచనాలు ప్రేక్షకులకు భారీగా పెరిగాయి.

రీసెంట్‌గా రిలీజైన డెవిల్ మూవీ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా ప్రమోషన్స్ జోరుని అప్పుడే పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవ‌ల మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ని భటి చూస్తే మాళవిక ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతోంది అని అర్థం అయిపోయింది.  ఇక మేక‌ర్స్ తాజాగా బాలీవుడ్ సెన్సేష‌న్ ఎల్నాజ్ నోరౌజీ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఆమె పోస్టర్ ని విడుదల చేస్తూ ఈ మూవీలో ఆమె రోజీ పాత్ర‌లో అల‌రించ‌నుంది అని తెలియజేశారు.

బాలీవుడ్ సెన్సేషనల్ నటి ఎల్నాజ్ నోరౌజీ మా డెవిల్ చిత్రంలో రోజీ పాత్ర‌లో అల‌రించ‌నుంది. ఆమె సిల్వ‌ర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ ప్రేక్ష‌కుల‌ను థియేటర్స్ రప్పిస్తుంది.  ఆమె ఈ చిత్రంలో త‌న‌దైన అద్భుత‌మైన డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకోనుంది. దానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్ పోస్ట‌ర్ సాక్ష్యం అంటూ డెవిల్ సినిమా ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా రూపొందుతోంది. గాంధీ న‌డికుడిక‌ర్ ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న అందించిన వ‌ర్క్ ఓ విజువ‌ల్ ట్రీట్‌ను అందిస్తుంది. సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా త‌మ్మిరాజు వ‌ర్క్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో  న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే మరి అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!

Also Read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News