జూనియర్ ఎన్టీఆర్‌కి పెంచల దాస్ ట్యూషన్స్ !

జూనియర్ ఎన్టీఆర్‌కి పెంచల దాస్ స్పెషల్ ట్యూషన్స్

Last Updated : May 29, 2018, 09:14 PM IST
జూనియర్ ఎన్టీఆర్‌కి పెంచల దాస్ ట్యూషన్స్ !

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కోసం చాలా హోంవర్క్ చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్న ఎన్టీఆర్.. డైలాగ్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ కథా, గేయ రచయితల సలహాలు, సూచనలు పాటిస్తూ అక్కడి భాషా నేపథ్యంతోనే డైలాగ్స్ రాసుకోవడంతోపాటు డైలాగ్ డెలివరిలోనూ ఆ ముద్ర కనిపించే విధంగా త్రివిక్రమ్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే ప్రముఖ రచయిత, జానపద గాయకుడు పెంచల దాస్ వద్ద ఎన్టీఆర్‌కి డైలాగ్ డెలివరిలలో ట్యూషన్స్ ఇప్పిస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ పెంచల దాస్ అంటే ఎవరనేనా మీ డౌట్.. అయితే, ఇటీవల కృష్ణార్జున యుద్ధం సినిమాలో " దారి చూడు దుమ్ము చూడు మామా... దున్నపోతుల బెరె చూడు మామా" అంటూ చిత్తూరు యాసలో పాటను రచించి, స్వయంగా పాడిన రచయిత, గాయకుడే ఈ పెంచల దాస్. 

 

హారికా హాసిని క్రియోషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

Trending News