NTR: స్టేజ్ పై పవన్, ప్రభాస్ డైలాగ్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. సంబరపడిపోయిన ఫ్యాన్స్..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు ఈ హీరో. కాగా ఈ హీరో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఇచ్చిన స్పీచ్ అందరిని ఫిదా చేసింది..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 9, 2024, 04:40 PM IST
NTR: స్టేజ్ పై పవన్, ప్రభాస్ డైలాగ్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. సంబరపడిపోయిన ఫ్యాన్స్..

Jr NTR- Trivikram: సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు దాటి ఇంకా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న ఘనంగా జరిపారు. ఈ సక్సెస్ మీట్ కి విశ్వక్ సేన్, త్రివిక్రమ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకావడం విశేషం.

ఈ క్రమంలో తన విడుదలకబోతున్న దేవరా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ హీరో. ఈ సినిమా ఆలస్యం అవుతున్నా కానీ తాము ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నామని.. తప్పకుండా ఈ చిత్రం కాలర్ ఎగరేసేలా ఉంటుంది అని చెప్పి అందరి అంచనాలు పెంచేశారు. కాగా ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ కూడా రావడంతో.. వీరిద్దరూ కలిసి చేసిన అరవింద సమేత రోజులు తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

 

ముందుగాటిల్లు స్క్వేర్ సీక్వెల్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి.  కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి” అని  డైలాగ్ చెప్పి త్రివిక్రమ్ వైపు చూశారు.. త్రివిక్రమ్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ ఫన్నీగా..”కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. కానీ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్. పోలె అదిరిపోలే” అంటూ అత్తారింటికి దారేది, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ఫేమస్ అయిన మీమ్ చెప్పి  అభిమానులని అలానే అక్కడ ఉన్న వారిని ఎంతో ఖుషి చేశారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ హీరో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా పెండింగ్ వర్క్ వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News