Jr NTR Lovely Wishes: లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. 'అమ్మలూ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్.. నెట్టింట్లో వైరల్

Jr NTR Lovely Birthday Wishes: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమెతో ఉన్న కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మలు అంటూ రెండు లవ్ సింబల్స్ షేర్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 28, 2023, 10:13 AM IST
Jr NTR Lovely Wishes: లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. 'అమ్మలూ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్.. నెట్టింట్లో వైరల్

Jr NTR Lovely Birthday Wish for His Wife Lakshmi Pranathi: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ రికగ్నైజేషన్ తెచ్చుకుని స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులందరికీ మాంచి కిక్ ఇస్తూ ఈ మధ్యనే ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమెతో ఉన్న కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మలు అంటూ రెండు లవ్ సింబల్స్ కూడా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ 2011వ సంవత్సరం మే 11వ తేదీన లక్ష్మీ ప్రణతి అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఫిక్స్ చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అతి దగ్గర బంధువులైన నార్నే శ్రీనివాసరావు కుమార్తె అయిన లక్ష్మీ ప్రణతిని నందమూరి తారకరామారావు జూనియర్ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగిన మొదట్లో అనేక విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

 కానీ ఎప్పుడూ బయటపడిన దాఖలాలయితే లేవు. ఇక వీరిద్దరికీ నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదివరకు ఎక్కువగా లక్ష్మీ ప్రణతి బయట కనిపించే వారు కాదు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎక్కడికి వెకేషన్ కి వెళ్తున్నా భార్యను కూడా దగ్గర ఉండి తీసుకు వెళుతున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ స్టార్ డం తెచ్చుకున్న సంగతి తెలిసింది. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఎన్టీఆర్ థర్టీ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన రక్తపు ట్యాంకర్ల ఫోటోలతో పాటు ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ కి పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎన్టీఆర్ 30 సినిమాకు కూడా పనిచేస్తున్నారనే ప్రకటన రావడంతో ఎన్టీఆర్ 30 సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Also Read: Samantha Saree Photos: శారీలో సమంత క్లీవేజ్ షో.. అందాల విందు చూస్తే నిద్రపోలేరు!

Also Read: Manchu Manoj: దగ్గరుండి మంచి విష్ణు పెళ్లి చేసిన మనోజ్ కు ఎక్కడ చెడింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News