Jr NTR - Devara North Business: 'దేవర' నార్త్ ఇండియా బిజినెస్ పూర్తి.. ఎన్టీఆర్ రేంజ్‌కు తొలి పరీక్ష..

Jr NTR - Devara North Business: 'ఆర్ఆర్ఆర్' మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఎంతో కాలం వెయిట్ చేసి మరి కొరటాల శివ చెప్పిన 'దేవర' మూవీకి ఓకే చెప్పాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన నార్త్ ఇండియా బిజినెస్ పూర్తి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2024, 07:45 AM IST
Jr NTR - Devara North Business: 'దేవర' నార్త్ ఇండియా బిజినెస్ పూర్తి.. ఎన్టీఆర్ రేంజ్‌కు తొలి పరీక్ష..

Jr NTR - Devara North Business: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా లెవల్లోనే కాదు.. గ్లోబల్ లెవల్‌కు ఎదిగాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జాన్వీ తొలి దక్షిణాది సినిమా అని చెప్పాలి. వెండితెరపై వీళ్లిద్దరి జోడిపై అపుడే బజ్ నెలకొంది. తాజాగా 'దేవర' మూవీ నార్త్ ఇండియా బిజినెస్ పూర్తైయింది. ఈ సినిమాను ఉత్తర భారత దేశంలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయనున్నారు. ఈ సినిమా దేవర థియేట్రికల్ బిజినెస్ రూ. 50 కోట్ల వరకు చేసినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా తారకకు ఇది పెద్ద పరీక్షే అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే  విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరోవైపు తెలుగులో సహా ఇతర భాషలకు కలిపి రూ. 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

'దేవర'  మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సింది. కానీ నీల్ మాత్రం.. ప్రభాస్‌తో 'సలార్ 2'మూవీ కంప్లీటైన తర్వాత ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇక దేవర మూవీలో ఎన్టీఆర్ మరోసారి త్రిపుల్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం.  

ఈ సినిమాలో ఎన్టీఆర్.. తండ్రి ఇద్దరు కుమారులుగా నటిస్తున్నట్టు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.  'దేవర' చిత్రాన్ని అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్స్‌కు ఈ సినిమాలో ఛాన్స్ ఉండే అవకాశాలున్నాయి.

'దేవర'లో ఎన్టీఆర్ త్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తే.. 'జై లవకుశ' తర్వాత ఎన్టీఆర్ త్రిపుల్ రోల్లోయాక్ట్ చేస్తోన్న సినిమా ఇదే అవుతోంది. ఈ జనరేషన్‌లో ఒక సినిమాలోనే త్రిపుల్ రోల్లో యాక్ట్ చేయడం గ్రేట్ అనుకుంటే రెండు సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు. ఇక ఎన్టీఆర్.. దేవర సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. మరోవైపు ఎన్టీఆర్.. 'వార్ 2' షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. నార్త్, సౌత్ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ మూవీ కూడా జూలై తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.  

Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News