NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల 'వార్ 2' పై గూస్ బంప్స్ తెప్పిస్తోన్న అప్డేట్..

NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా   ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై ఓ బిగ్ అప్‌డేట్ ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2024, 12:33 PM IST
 NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల 'వార్ 2'  పై గూస్ బంప్స్ తెప్పిస్తోన్న అప్డేట్..

NTR - Hrithik Roshan - War 2: జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు).. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్యాన్ ఇండియా (భారత్) స్టార్‌గా గ్లోబల్‌ లెవల్లో  సత్తా చూపించాడు. ఈ మూవీలో  కొమరం భీమ్ పాత్రలో తారక్ యాక్టింగ్‌ను  ఎవరు అంత ఈజీగా మరిచిపోలేదు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది.  ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సింది. కానీ నీల్ మాత్రం.. ప్రభాస్‌తో 'సలార్ 2'మూవీ కంప్లీటైన తర్వాత ఎన్టీఆర్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ తన సినిమా షెడ్యూల్స్‌ను మార్చుకున్నాడు. దేవర రెండు పార్టులతో పాటు అటు వార్ 2 మూవీ కంప్లీట్ చేయాలనే కసితో ఉన్నాడు.  

ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా దేవర మూవీ షూటింగ్ ఆలస్యం కానుంది. మరోవైపు హృతిక్ రోషన్.. కూడా గాయలపాలై ఇపుడిపుడే కోలుకుంటున్నాడు. తాజాగా హృతిక్.. వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. జపాన్‌లో  ఉన్న షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఇంట్రో  సీన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ ఈ నెల 20తో దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత వారం రోజులు రెస్ట్ తీసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. 60 రోజుల డేట్స్ కేటాయించారట. అందులో 30 రోజులు పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై సంయుక్తంగా ఈ సినిమా షూట్ చేయనున్నారట. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయట. ఇపుడున్న దానికి హాలీవుడ్ హై టెక్నాలజీతో భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మించనున్నారు. మరోవైపు ఈ సినిమా ఎక్కువ భాగాన్ని ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూట్ చేయనున్నారట. హృతిక్ తన పార్ట్‌ను జూన్ చివరి వరకు కంప్లీట్ చేయనున్నారు. ఎన్టీఆర్ తన షూటింగ్ పార్ట్‌ను జూలై నెలాఖరు వరకు పూర్తి చేయనున్నాడు. 

ఈ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని వచ్చే యేడాది 2025 జనవరి 26న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా కియారా పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ కథానాయికగా నటించడం దాదాపు కన్ఫామ్ అయిందని చెబుతున్నారు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈమె హృతిక్ సరసన నటిస్తుందా.. ? లేకపోతే ఎన్టీఆర్‌కు జోడిగా యాక్ట్ చేస్తుందా అనేది చూడాలి. లేకపోతే ఆలియా, కియారా ఇద్దరు యాక్ట్ చేస్తారా  అనేది చూడాలి. 

మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.  దీంతో పాటు మరో హిందీలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో ఓ సినిమా ఉండనే ఉంది. దాంతో పాటు  కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడు. త్వరలో వీళ్లిద్దరితో చేయబోయే సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. అటు హృతికో రోషన్.. రీసెంట్‌గా 'ఫైటర్' మూవీతో పలకరించారు. 

Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News