Jr NTR Birthday: జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు, బాలకృష్ణ పూర్తిగా పక్కకు పెట్టేశారా ? రుజువు ఇదేనా ?

Chandrababu Naidu, NBK Ignores Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు నాడు నందమూరి అభిమానులు తారక్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. తారక్‌కి బాగా కావాల్సిన బాలయ్య బాబు, చంద్రబాబా నాయుడు మాత్రం కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 09:35 PM IST
  • ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పని చంద్రబాబు, బాలకృష్ణ
    ఇద్దరు పార్టీ నేతలకు ట్విట్టర్‌లో చంద్రబాబు విషెస్‌
    ఎన్టీఆర్‌ ప్రస్తావన తీసుకురాని చంద్రబాబు నాయుడు
    ఫోటో లేకుండా ట్విట్టర్‌లో సాదాసీదాగా విషెస్‌ చెప్పిన నారా లోకేష్‌
Jr NTR Birthday: జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు, బాలకృష్ణ పూర్తిగా పక్కకు పెట్టేశారా ? రుజువు ఇదేనా ?

Chandrababu Naidu, NBK Ignores Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ పట్ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచన మరోసారి ప్రస్ఫుటమయ్యింది. ఎన్టీఆర్‌ పుట్టినరోజు నాడు ఈ అంశం తేటతెల్లమయ్యింది. సందర్భం వచ్చినప్పుడల్లా జూనియర్‌ ఎన్టీఆర్‌ పట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న చంద్రబాబు తాజాగా అదే వైఖరి అవలంబించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. వాస్తవానికి శుక్రవారం ఇద్దరు టీడీపీ నాయకుల బర్త్‌డేల సందర్భంగా చంద్రబాబు తన ట్విట్టర్‌ అకౌంట్లో వాళ్లకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. వాళ్ల ఫోటోలు పోస్ట్‌ చేసి మరీ ట్వీట్లు చేశారు. కానీ, జూనియర్‌ ఎన్టీయార్‌కు మాత్రం విషెస్‌ చెప్పలేదు. పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ఇంట్లో మనిషి, బంధువు కూడా అయిన ఎన్టీఆర్‌ విషయంలో పట్టనట్టు వ్యవహరించడం చర్చను లేవనెత్తుతోంది.

jr-ntr-birthday-special-wishes-chandrababu-naidu-and-balakrishna-did-not-wish-ntr-on-his-birthday.jpg

శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే, కేక్‌కటింగ్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్టీఆర్‌ అభిమానులు అక్కడే ఉన్న చంద్రబాబును పిలిచినా వెళ్లలేదని అక్కడున్న వాళ్లు చెబుతున్నారు. బాబు ముఖంలో ఆ సమయంలో విసుగు కనిపించినా బయట పడకుండా జాగ్రత్తపడ్డాడని అంటున్నారు. ఇటీవల కుప్పంలో ఓ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై కన్నెర్ర జేసిన వ్యవహారం బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్‌ కావడమే చంద్రబాబు తాజాగా సైలెంట్‌గా ఉండటానికి కారణమంటున్నారు. 

jr-ntr-birthday-special-wishes-why-chandrababu-naidu-and-balakrishna-did-not-wish-ntr-on-his-birthday.jpg

సరిగ్గా వారం రోజుల క్రితం అంటే గత శుక్రవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అక్కడ ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకుడు, టీడీపీ కార్యకర్త అయిన శివ వచ్చాడు. అయితే, కొద్దికాలంగా శివ.. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలంటూ బ్యానర్లు కూడా ప్రదర్శిస్తున్నాడని చంద్రబాబుకు తెలిసింది. ఆ విషయం తెలియగానే.. చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారని ఆ సమయంలో అక్కడున్న వాళ్లు చెప్పారు. పార్టీ వేరు.. అభిమానం వేరు అన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌పై అభిమానం అక్కడికే పరిమితం చేయాలని, పార్టీలో చీలికలు తీసుకొచ్చే పనులు చేయొద్దని శివకు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చంద్రబాబు వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అనుభవం గుర్తొచ్చిన చంద్రబాబు.. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన పరిణామంలో సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు.  

మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్‌ బాబాయి అయిన బాలకృష్ణ కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పలేదు. అటు చంద్రబాబు.. ఇటు చంద్రబాబుకు వియ్యంకుడు అయిన బాలకృష్ణ కూడా జూనియర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. స్వయంగా హీరో అయిన బాలకృష్ణ.. తన అన్న కుమారుడు, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పకపోవడం వెనుక చంద్రబాబు ప్రోద్భలం ఉందేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. కానీ, చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాత్రం.. ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు (HBD Tarak) తెలియజేశారు. అయితే, జూనియర్‌ ఎన్టీఆర్ ఫోటో ఏదీ లేకుండా.. సాదాసీదాగా ట్వీట్‌ చేశారు. ఈ అంశం కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Also read : Chandrababu Naidu: కుప్పం పర్యటనలో జూ.ఎన్టీఆర్ అభిమానిపై ఫైర్ అయిన చంద్రబాబు నాయుడు..?

Also read : NTR 31 Movie Poster: ఉగ్రరూపంలో తారక్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News