RRR: ఆర్ఆర్ఆర్‌ నుంచి 'భీమ్' కొత్త పోస్టర్... ఇంటెన్స్ లుక్‌లో ఎన్టీఆర్

Jr.NTR Bheem poster from RRR: ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించి మరో పోస్టర్‌ విడుదలైంది. తాజా పోస్టర్‌లో ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ అభిమానులను కట్టిపడేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 01:01 PM IST
  • ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ భీమ్ పోస్టర్
  • ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్
  • ఈ సాయంత్రం రాంచరణ్ అల్లూరి పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల
RRR: ఆర్ఆర్ఆర్‌ నుంచి 'భీమ్' కొత్త పోస్టర్... ఇంటెన్స్ లుక్‌లో ఎన్టీఆర్

Jr.NTR Bheem poster from RRR: ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ (NTR as Bheem in RRR) విడుదలైంది. ఒంటిపై రక్తపు గాయాలతో ఎన్టీఆర్ లుక్ ఇంటెన్సివ్‌గా (Jr NTR new look) కనిపిస్తోంది. అడవిలో సాగే పోరాట సన్నివేశాల్లో భాగంగా ఎన్టీఆర్ ఈ లుక్‌లో కనిపించనున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఇదే సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ నేటి సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది.

దర్శక దిగ్గజం రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ (Ramcharan Tej) హీరోలుగా ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మన్యం వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఆలియా భట్‌ , ఒలివియా మోరీస్‌, ఇతర కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని నటిస్తున్నారు. ఫిక్షన్ పీరియాడికల్ డ్రామాగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ఇరగదీసిన 'నాటు నాటు' సాంగ్, ఇటీవల విడుదలైన 'జనని' సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను (RRR Updates) ఈ నెల 9న విడుదల చేయనున్నారు. వచ్చే జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Also Read: Pushpa Trailer: పుష్ప ట్రైలర్ కోసం తగ్గెదేలే అంటున్న Allu Arjun fans

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News