Jordar Sujatha - Rocking Rakesh : జబర్దస్త్ జోడి బాగుందే.. రాకేష్‌ ఇంట్లోనే సుజాత ఉంటోందా?.. పిక్ వైరల్

Jordar Sujatha And Rocking Rakesh జబర్దస్త్ జోడిగా రాకేష్‌, సుజాత నెట్టింట్లో చేస్తోన్న రచ్చ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వస్తూనే ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 08:01 PM IST
  • నెట్టింట్లో జబర్దస్త్ జోడి సందడి
  • రాకేష్ సుజాత జంట హల్చల్
  • రాకేష్ ఇంట్లోనే సుజాత ఉంటోందా?
Jordar Sujatha - Rocking Rakesh : జబర్దస్త్ జోడి బాగుందే.. రాకేష్‌ ఇంట్లోనే సుజాత ఉంటోందా?.. పిక్ వైరల్

Jordar Sujatha - Rocking Rakesh : బుల్లితెరపై లవ్ ట్రాకులు ఎంతగా వర్కవుట్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ వేదిక మీద ఎన్ని జంటలు పుట్టుకొచ్చాయో అందరికీ తెలిసిందే. రష్మీ సుధీర్ జోడితో జబర్దస్త్ షోకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద చేసిన కెమిస్ట్రీకి జనాలు ఫిదా అయ్యారు. సుధీర్ రష్మీ జోడి తరువాత చాలానే జంటలు ఆ రేంజ్‌లో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించాయి. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు.

సుధీర్ రష్మీ తరువాత వర్ష ఇమాన్యుయేల్ జోడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ రేంజ్‌లో మాత్రం క్లిక్ కాలేకపోయింది. కొన్ని రోజులు రాకేష్ రోహిణి ట్రాక్ నడిచింది. కానీ వెంటనే సుజాత ఎంట్రీ ఇచ్చింది. అలా రాకేష్ సుజాత ట్రాక్ బాగానే క్లిక్ అయింది. సుజాత రాకేష్‌ ఇద్దరూ కూడా స్కిట్లో తెగ జీవించేవారు. అవి స్కిట్ల కోసం చేస్తున్నారా? నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే విషయాన్ని పసిగట్టడం కూడా కష్టమే.

పోనీ జబర్దస్త్ షోలో అంటే టీఆర్పీల కోసం అలా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇతర షోలకు వెళ్లినప్పుడు కూడా అదే రేంజ్‌లో జీవిస్తుంటారు. గుండెలను టచ్ చేసేలా డైలాగ్స్ చెబుతారు. ఆర్ఆర్ వేయించుకుంటారు. అందరినీ నమ్మింపజేస్తారు. అయితే ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఎన్నో రోజుల నుంచి రూమర్లు వస్తూనే ఉన్నాయి.

 

ఇప్పుడు రాకేష్ ఓ పోస్ట్ వేశాడు. అందులో తన స్నేహితుడు రచ్చ రవి కొత్త కారుని కొన్నాడని చెబుతూ.. అది చూపించేందుకు ఇంటి వరకు వచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ రాకేష్ ఇంటి వద్ద సుజాత కూడా ఉంది. ఆ ఫోటోలో రచ్చ రవి, సుజాత, రాకేష్ ఇలా ముగ్గురూ పోజులు ఇచ్చారు. 

అంటే సుజాత ఇప్పుడు రాకేష్ వ్యవహారం మీద భారీగా జరుగుతోంది. పైగా ఈ ఇద్దరూ మిస్టర్ అండ్ మిసెస్ షోలో సందడి చేస్తున్నారు. అక్కడ కూడా ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆ షోకు శ్రీముఖి హెస్ట్‌గా, శివ బాలాజీ, స్నేహలు జడ్జ్‌లుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. పది జంటల్లో రాకేష్ సుజాత ఏ స్థానంలో నిలుస్తారో చూడాలి.

Also Read : Unstoppable season 2 episode 3 : కుర్ర హీరోలతో బాలయ్య సందడి.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లతో కబుర్లు

Also Read : Samantha Myositis : అనారోగ్యంతో సమంత.. భరోసా నిచ్చిన అక్కినేని హీరోలు.. వెంకీమామ కూతురి కామెంట్‌ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News