Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ తో తిరుమల లో జాహ్నవి కపూర్.. వీడియో వైరల్..!

Janhvi Kapoor Boyfriend: చాలా కాలంగా బాలీవుడ్ బ్యూటీ.. జాన్వి కపూర్, శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా.. ప్రకటించకపోయినప్పటికీ.. తాజాగా ఈ జంట.. తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 13, 2024, 03:14 PM IST
Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ తో తిరుమల లో జాహ్నవి కపూర్.. వీడియో వైరల్..!

Janhvi Kapoor Shikar Paharia: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి తెలియని వారు ఉండరు. లెజెండరీ నటి శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కంటెంట్ కి ప్రాధాన్యత ఉండే కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుంటు కెరియర్లో ముందుకు దూసుకు వెళ్తోంది. 

అయితే చాలా కాలంగా జాహ్నవి కపూర్ శిఖర్ పహారియా అనే వ్యక్తితో ప్రేమలో ఉంది అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కానీ ఈ జంట మాత్రం ఎప్పుడూ అధికారికంగా తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టలేదు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ జంట.. తిరుపతికి స్వామివారి దర్శనార్థం వెళ్లి కెమెరా కంట చిక్కారు. ప్రతి ఏడాది ఆగస్టు 13వ తేదీన చనిపోయిన శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా.. జాన్వి కపూర్ తిరుపతి వెళుతూ ఉంటారు. 

ఈ ఏడాది కూడా ఇవాళ అంటే ఆగస్టు 13వ తేదీన శ్రీదేవి పుట్టినరోజు జ్ఞాపకంగా జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడే మీడియాకి కనిపించారు. పసుపు రంగు చీర కట్టుకొని.. జాన్వి కపూర్ అందంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే మీడియా వాళ్ళు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆమె సున్నితంగా వద్దు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. 

 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ఈ జంట ఎప్పుడూ కలిసే కనిపిస్తూ ఉండడంతో.. త్వరలోనే వీరి పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది అని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇక తాజాగా జాన్వి కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్‌ గాంధీని లాగిన కేటీఆర్‌

Also Read: Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్‌ ఇస్తా: చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News