Janhvi Kapoor:మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డితో జాన్వీ క‌పూర్ పెళ్లి .. క‌న్ఫామ్ చేసిన బోనీ కపూర్..

Janhvi Kapoor Marriage: జాన్వీ క‌పూర్  పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోతుందా.. ? ఈ విష‌యాన్ని తండ్రి బోనీ క‌పూర్ కూడా క‌న్ఫామ్ చేసాడు.  అతిలోక సుంద‌రి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ను పెళ్లి చేసుకోబోయే వాడి బ్యాక్ గ్రౌండ్ గురించి అంద‌రు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 2, 2024, 11:04 AM IST
 Janhvi Kapoor:మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డితో జాన్వీ క‌పూర్ పెళ్లి .. క‌న్ఫామ్ చేసిన బోనీ కపూర్..

Janhvi Kapoor:ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్స్ కెరీర్ పీక్ స్టేజీలో ఉండ‌గానే పెళ్లి పీఠ‌లు ఎక్కుతున్నారు. ఈ ట్రెండ్ ఈ మ‌ధ్య ఎక్కువైంది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా కెరీర్ ఫేడౌట్ అయ్యాకా కానీ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే వారు కాదు.  కానీ ఈ మ‌ధ్య క‌థానాయిక‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే పెళ్లి పీఠ‌లు ఎక్కుతున్నారు. పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత హీరోయిన్‌గా కంటిన్యూ చేస్తున్నారు. ఇదే కోవ‌లో జాన్వీ క‌పూర్  పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోత‌న్న‌ట్టు .. జాన్వీ తండ్రి బోనీ క‌పూర్ కన్ఫామ్ చేసారు.

మహారాష్ట్ర మాజీ సీఎం .. కేంద్ర మాజీ హోం మంత్రిగా. ప‌నిచేసిన సుశీల్ కుమార్ షిండే ..ఈయ‌నకు తాత అవుతారు. ఈయ‌న ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. వీళ్ల కూతురు కుమారుడే శిఖ‌ర్ ప‌హారియా. ఈయ‌న తండ్రి సంజ‌య్ ప‌హారియా .. మ‌హారాష్ట్ర‌లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఇత‌ను గ‌త కొన్నేళ్లుగా జాన్వీ క‌పూర్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఇక జాన్వీ, శిఖ‌ర్ క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

వీళ్లిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు బోనీ క‌పూర్ క‌న్ఫామ్ చేసాడు. త్వ‌ర‌లో ఎంగేజ్మెంట్ స‌హా పెళ్లి డేట్‌ను క‌న్ఫామ్ చేయ‌నున్నారు. ఈసంద‌ర్భంగా బోనీ కపూర్.. త‌న‌కు కాబోయే అల్లుడు శిఖ‌ర్ ప‌హాడియా వ్య‌క్తిత్త‌త్వం గురించి మాట్లాడుతూ.. అత‌ను ఎంతో విన‌య సంప‌న్నుడు. పెద్ద‌లంటే గౌర‌వం ఉంద‌ని కొనియాడారు.అంతేకాదు శిఖ‌ర్... జాన్వీతో పాటు మా కుటుంబానికి ఎంతో ఆప్తుడుగా ఎల్ల‌వేళ‌ల మాకు తోడుగా నిలిచిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

జాన్వీ కపూర్ విష‌యానికొస్తే..
శ్రీ‌దేవి త‌న‌య‌గా సినీ  ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో దూసుకు పోతుంది. హిందీలో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో న‌టించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా రిలీజైంది. అక్క‌డ కూడా ఈ సినిమా  మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో ద‌క్షిణాది సినీ  ఇండస్ట్రీలో అడుగుపెట్ట‌బోతుంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది.

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీకి సైన్ చేసింది. తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.  జాన్వీ క‌పూర్.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో  షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది జాన్వీ.

Read More: Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News