IT Raids on Sithara Naga Vamsi concluded Finally: హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధా కృష్ణ, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత నాగవంశీ నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్ ఎట్టకేలకు ముగిశాయి. వాస్తవానికి ఈ ఐటీ రైడ్స్ మొదలై నాలుగు రోజులు గడుస్తున్నా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు రైడ్స్ ముగిస్తున్నట్లుగా వెల్లడించినట్లు తెలుస్తోంది. నిర్మాత నాగవంశీ అలాగే ఆయన బాబాయ్ రాధాకృష్ణ ఇద్దరి ఇళ్లు, ఆఫీసుల మీద ఐటీ అధికారులు దాడి చేసినట్లు చెబుతున్నారు.
నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమాలు చేస్తుంటే ఆయన బాబాయ్ రాధాకృష్ణ మాత్రం హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ సినిమాలు, సితార ఎంటర్టైన్మెంట్స్ మీద చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తూ ఒక రేంజ్ లో నడిచిపోతున్న వీరు ఈ మధ్యనే మై హోమ్ గ్రూప్ ప్రారంభించిన శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ తో కలిసి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఐటీ రైడ్స్ జరిగాయి అని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి నాలుగు రోజులుగా అధికారులు ఇద్దరు నిర్మాతలను ఇంటికే పరిమితం చేసి ఆ డీటెయిల్స్ కావాలి, ఆ కాగితాలు కావాలి అంటూ పెద్ద ఎత్తున వారిని ఇబ్బంది పెట్టి మరీ నాలుగు రోజులు పాటు రైడ్స్ జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రైడ్స్ టెన్షన్ తో జనవరి 26వ తేదీన విడుదలకు రంగం సిద్ధమైన బుట్ట బొమ్మ అనే సినిమాని కూడా వాయిదా వేసుకునేందుకు నాగవంశీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని ఎస్ రాధాకృష్ణ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఐటీ రైడ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మై హోమ్ గ్రూప్ తో ఉన్న కనెక్షన్స్ వల్ల ఐటీ రైడ్స్ జరిగాయి అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ ఈ విషయం మీద నిర్మాత నాగవంశీ లేదా రాధాకృష్ణ లేదా రైడ్స్ జరిపిన అధికారులు క్లారిటీ ఇస్తే తప్ప ఈ రైడ్స్ ఏ కారణం చేత జరిగాయి అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Rashmika Mandanna Emotional: మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్.. రష్మిక ఏమందో తెలుసా?
Also Read: Mahesh Babu Rajamouli Film: కామెరూన్ కామెంట్స్ తో మహేష్ -జక్కన్న మూవీపై ఇంటర్నేషనల్ లెవల్లో అంచనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IT Raids on Naga Vamsi: సితార నాగ వంశీ, రాధాకృష్ణల మీద నాలుగు రోజుల పాటు ఐటీ రైడ్స్?