Raids On Mythri Movie Makers and Sukumar: టాలీవుడ్ మీద కన్నేసిన ఐటీ అధికారులు గత కొంతకాలంగా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలపై రైడ్స్ జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు రంగంలోకి దిగిన ఐటీ అధికారులు పలువురు బడా నిర్మాతలు, దర్శకులపై దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. వరుస హిట్ సినిమాలతో సూపర్ జోష్ మీద ఉన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ నివాసాలు, కార్యాలయాలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ నిర్వహించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న నివాసాలు, ఆఫీసులలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఐడి రైడ్స్ నేపథ్యంలో సుకుమార్, పుష్ప సినిమా షూటింగ్ కూడా నిలిపివేసి ఐటి అధికారులకు అందుబాటులో ఉండేందుకు తన నివాసానికి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ లోని ఒక ఎమ్మెల్యే, తెలంగాణలోని మరో ఎమ్మెల్యే నుంచి సినిమాల నిర్మాణానికి గాను నిధులు అందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒక ఎమ్మెల్యే మైనింగ్ బిజినెస్ లో ఉన్నారని కొంత మనీలాండరింగ్ కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది.
ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇద్దరూ గతంలో అమెరికాలో వ్యాపారాలు చేసి భారతదేశం వచ్చి సినీ నిర్మాణంలోకి దిగారు. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వర్గాలు మాత్రం తమ అకౌంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అని ఇవి రొటీన్ రైడ్స్ లో భాగమే అని చెబుతున్నారు. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ లు కావడంతో పాటుగా ఇప్పుడు పుష్ప 2 సినిమాను కూడా భారీ ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో ఐటీ రాడార్ దృష్టిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పడినట్లు తెలుస్తోంది.
పుష్ప మొదటి భాగాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి మీడియా వర్క్స్ అనే బ్యానర్ తో నిర్మించగా రెండో భాగాన్ని మాత్రం సుకుమార్ సొంత నిర్మాణ సంస్థతో కలిసి నుంచి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు సుకుమార్ ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థల మీద వరుస ఐటీ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక వీరికి ఫండ్స్ ఇస్తున్నట్లుగా అనుమానిస్తున్న ఎమ్మెల్యేల మీద కూడా ఐటీ నజర్ వేసినట్లు చెబుతున్నారు. మనీ లాండరింగ్ విషయంలో కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook