Vimala Raman Wedding: తమిళ విలన్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌?

Vimala Raman, Vinay Rai Wedding. కోలీవుడ్‌ హీరో, విలన్‌ వినయ్‌ రాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విమలా రామన్ త్వరలోనే వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 03:18 PM IST
  • తమిళవిలన్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌?
  • మోడల్‌గా కెరీర్ ఆరంభించిన అందాల భామ విమలా
  • విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ లవ్ ట్రాక్
Vimala Raman Wedding: తమిళ విలన్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌?

Is Tamil Actor Vinay Rai getting married to Tollywood Heroine Vimala Raman: మోడల్‌గా కెరీర్ ఆరంభించిన అందాల భామ విమలా రామన్.. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. మొదట మలయాళ సినిమాల్లో నటించిన విమలా.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. గాయం-2, చట్టం, ఎవరైనా ఎపుడైనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. మలయాళంలో స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకున్నారు. 

కోలీవుడ్‌ హీరో, విలన్‌ వినయ్‌ రాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విమలా రామన్ త్వరలోనే వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది.  తాజాగా వీరి మూడుముళ్ల బంధానికి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం తెలుస్తోంది. పెద్దలను ఒప్పించిన విమలా-వినయ్‌ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారట. ఈ ప్రేమ జంట త్వరలోనే తమ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. 

గత కొన్నేళ్లుగా వినయ్‌ రాయ్‌-విమల రామన్ లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తరచూ వీళ్లిద్దరూ విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు. ఆ మధ్య మాల్దీవులు వెళ్లిన ఈ ప్రేమ పక్షులు అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలోనూ షేర్‌ చేసుకున్నారు. ఈ ప్రేమ జంట పలుసార్లు కెమెరాకు చిక్కి వార్తల్లో కూడా నిలిచారు. అప్పుడే అసలు విషయం అందరికి తెలిసిపోయింది. వాన సినిమాతో వినయ్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

2007లో 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో వినయ్‌ రాయ్‌ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన వినయ్‌.. జయం కొందాన్‌, ఎంద్రెంద్రమ్‌ పున్నగై వంటి పలు హిట్‌ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్‌ (డిటెక్టివ్) సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు. చంద్రకళ, డాక్టర్‌, ఈటీ (ఎవరికీ తలవంచడు) చిత్రాల్లో నెగెటివ్‌ పాత్రలతో అదరగొట్టాడు. ప్రస్తుతం హీరో సూర్య నిర్మిస్తున్న 'ఓ మై డాగ్‌' సినిమాలో వినయ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.

Also Read: IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో

Also Read: Alia and Ranbir Marriage: పెళ్లికి సిద్ధమైన ఆలియా, రణ్ బీర్ కపూర్.. వేడుక ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News