Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!

Nayanthara, Vignesh Shivan Marriage. పెళ్లి ఎప్పుడా అని ఎదురు చేస్తున్న అభిమానులకు స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌లు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 08:20 AM IST
  • కొంతకాలంగా సహజీవనం
  • గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్
  • పెళ్లిచేసుకున్న నయనతార
Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!

Is Nayanthara, Vignesh Shivan gets Married: స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 'నానూ రౌడీదాన్‌' సినిమా షూటింగ్‌ సమయంలో లవ్‌లో పడ్డ ఈ జోడి.. అప్పటి నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట.. లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం రహస్యం చేసుకున్నా.. లాక్‌డౌన్‌ అనంతరం పెళ్లి మాత్రం ఘనంగా చేసుకుంటామని పలు ఇంటర్వ్యూలలో నయన్, విఘ్నేశ్‌ సమాధానం ఇచ్చారు.

పెళ్లి ఎప్పుడా అని ఎదురు చేస్తున్న అభిమానులకు నయన్, విఘ్నేశ్‌ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ జంట ఇప్పటికే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇందుకు సాక్షం లేకపోలేదు.. తాజాగా నయనతార ఒక గుడిలో నుదుటున బొట్టుతో కనిపించారు. దాంతో ఈ జంట ఇప్పటికే పెళ్లిచేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. 

లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకొని బయటికి వచ్చిన నయన్.. నుదుటిన కుంకుమతో దర్శనమిచ్చారు. అక్కడ ఉన్న అభిమానులు హయ్ చెప్పారు. వారు నయనతారను ఫోటోలలో, వీడియోలలో బంధించారు. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝑵𝒂𝒚𝒂𝒏𝒕𝒉𝒂𝒓𝒂 (@nayanthara.kurian)

మరి నిజంగానే నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ జంట పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ ప్రేమ జంట క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం వీరిద్దరూ 'కాతువాక్కుల రెండు కాదల్‌' సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. విఘ్నేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమాలో నయనతార, సమంత, విజయ్‌ సేతుపతిలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రై యాంగిల్ ప్రేమ కథా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. 

Also Read: Horoscope Today March 14 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వృధా ఖర్చులు ఉన్నాయి!!

Also Read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News