Nayanthara Conditions: దర్శకనిర్మాతలకు నయనతార కొత్త కండీషన్‌.. సినిమా అవకాశాలు వచ్చేనా?

Is Nayanthara put New Conditions to Sign films after marriage. సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు స్థార్ హీరోయిన్ నయనతార కొత్త కండీషన్స్‌ పెడుతున్నారని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2022, 05:22 PM IST
  • వివాహబంధంలోకి నయనతార, విఘ్నేశ్‌
  • నయనతార కొత్త కండీషన్‌
  • సినిమా అవకాశాలు వచ్చేనా?
Nayanthara Conditions: దర్శకనిర్మాతలకు నయనతార కొత్త కండీషన్‌.. సినిమా అవకాశాలు వచ్చేనా?

Is Nayanthara put New Conditions to Sign films after marriage: స్థార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌ గతవారం (జూన్ 9) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వివాహం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయ రీతిలో జరిగిన ఈ పెళ్లివేడుకకు బంధువులు, అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం అనంతరం ఈ జంట తిరుమల తిరుపతికి వచ్చి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. 

పెళ్లి తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతారలో భారీ మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు నయన్ కొత్త కండీషన్స్‌ పెడుతున్నారని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ఇకపై తాను గ్లామర్ రోల్స్‌ చేయనని చెప్పారట. ఇకపై దర్శకనిర్మాతలు గ్లామర్ రోల్స్‌ కోసం కాకుండా ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాల కోసమే తన దగ్గరికి రావాలని నయనతార కొత్త కండీషన్‌ పెట్టనున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. 

నిజానికి గత కొంత కాలంగా నయనతార గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్నారు. స్టార్‌ హీరోలతో నటిస్తున్న సినిమాలలో కూడా  పరిమితుల మేరకే నటిస్తున్నారు. ఇటీవల ఎక్కువగా నయన్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నయన్ చేతిలో తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు ఎలాంటి కండీషన్‌ పెట్టలేదని సమాచారం. ఇక నుంచి ఒప్పకునే సినిమాలకే ఈ కొత్త కండీషన్ పెట్టారట. దాంతో ఇకపై నయన్ వద్దకు గ్లామర్ సినిమా అవకాశాలు రావోమో ఇగ. 

Also Read: Indian Railways Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1.48 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీకి ప్రకటన!  

Also Read: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ ప్లేట్లు తప్పనిసరి! పాత వాహనాలకు కూడా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News