Arjun emotional speech : డార్లింగ్ నువ్వు లేక పోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన అల్లు అర్జున్

Allu Arjun gets emotional on pushpa thank you meet : బన్నీ తన కెరీర్‌‌లో డైరెక్టర్ సుకుమార్‌‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు బన్నీ. తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన భారీ హిట్ ఆర్య మూవీ సుకుమార్ డైరెక్షన్‌లోనే వచ్చిందని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఆర్య మూవీ లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేనన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 05:34 PM IST
  • అల్లు అర్జున్ ఫుల్ ఎమోషనల్
  • ఆర్య మూవీ లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో...
  • జీవితంలో రుణపడి ఉంటాననే మాట చాలా కొంతమందికే వాడతానన్న అల్లు అర్జున్
  • ఈ స్థాయికి రావడానికి కారణం సుకుమార్‌‌ అంటూ ఏడ్చేసిన బన్నీ
Arjun emotional speech : డార్లింగ్ నువ్వు లేక పోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన అల్లు అర్జున్

Icon star Allu Arjun gets emotional on pushpa movie thank you meet : బన్నీ.. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మూవీ యూనిట్ తాజాగా హైదరాబాదులో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో అల్లు అర్జున్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌‌లో డైరెక్టర్ సుకుమార్‌‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు బన్నీ. తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన భారీ హిట్ ఆర్య మూవీ సుకుమార్ డైరెక్షన్‌లోనే వచ్చిందని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఆర్య మూవీ లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేనన్నారు.

తాను జీవితంలో రుణపడి ఉంటాననే మాట చాలా కొంతమందికే వాడతానని అన్నారు అల్లు అర్జున్. (Allu Arjun) ఒక రైతుగా ఉన్న మా తాత సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకోకపోయింటే మేమందరం ఈ రోజు ఇండస్ట్రీలో ఉండేవాళ్లం కాదు కదా అని బన్నీ పేర్కొన్నారు. అందువల్ల తాను రుణపడి ఉంటాననే మాటను తన తాతయ్య అల్లు రామలింగయ్యకు వాడతానన్నారు... అలాగే జన్మనిచ్చిన తన తల్లిదండ్రులకు కూడా ఈ పదాన్ని వాడతాను అన్నారు. ఇక మొదటి మూవీ నుంచి ప్రోత్సహిస్తోన్న చిరంజీవికి (Chiranjeevi) కూడా రుణపడతాను అనే మాటను ఉపయోగిస్తాను అన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆ మాట సుకుమార్ కోసం వాడతానన్నారు బన్నీ. (Bunny)

తాను పరుగు మూవీ సమయంలో ఒక స్పోర్ట్స్ కారు కొన్నానని.. దాని ఖరీదు 85 లక్షల రూపాయలని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.అయితే ఆ కొత్త కారు స్టీరింగ్‌పై చేయిపెట్టి తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరని ఆలోచిస్తే మొదట గుర్తొచ్చిందే సుకుమారే అని ఎమోషనల్ అయ్యాడు బన్నీ. డార్లింగ్.. నువ్వు లేకపోతే ఇవాళ నేను లేను అంటూ సుకుమార్‌‌ను (Sukumar‌) ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

 

Also Read : Ashok Gajapati Raju: అశోక గజపతిరాజుకు ఆ కారు టెన్షన్.. పూర్తిగా పక్కన పెట్టేశారు..

ఇక ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు బన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ మాటలు వింటున్న సుకుమార్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. సుకుమార్‌ ఉండడం వల్ల నా లైఫ్‌ ఇలా ఎంతో బాగుంది... లేకపోయి ఉంటే వేరేలా ఉండేదంటూ అల్లు అర్జున్ అన్నాడు. తాను పబ్లిక్‌లో భావోద్వేగానికి గురవకూడదని అనుకుంటూ ఉంటానని.. కానీ కుదరట్లేదు అన్నాడు బన్నీ. తనని స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌ చేసి.. యావత్‌ భారతదేశం చూసేలా చేశారంటే తన కెరీర్‌ కోసం సుకుమార్‌ ఎంత కంట్రిబ్యూషన్‌ ఇచ్చారో మాటల్లో చెప్పలేను అని అల్లు అర్జున్ (Allu Arjun) భావోద్వేగానికి గురయ్యారు.

Also Read : Xiaomi 12 series: మార్కెట్‌లోకి షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధరలు మాత్రం..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News