Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!

Nani Clarity about Abusive Word in Dasara : దసరా మూవీలో మాట్లాడిన బూతు మాట గురించి హీరో నాని క్లారిటీ ఇచ్చారు, అసలు ఆ పదం ఏమిటి అనే అంశం మీద ఆయన మాట్లాడారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 13, 2023, 08:45 PM IST
Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!

Nani Clarity about Abusive Word in Dasara Movie: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా. కొన్నాళ్ల క్రితం శ్యామ్ సింగరాయ్  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఓ మాదిరి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన అంటే సుందరానికీ సినిమా మాత్రం దెబ్బేసింది. దీంతో ఈసారి చేసే సినిమా ఖచ్చితంగా హిట్టు కొట్టాలని భావిస్తున్న ఆయన ఆ సినిమా మీద ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అలా శ్రద్ధ తీసుకుని చేస్తున్న దసరా సినిమా మీద అంచనాలు కూడా పెరుగుతున్నాయి.  

దానికి తగినట్లుగానే సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ విడుదల కాగా ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. అయితే అందులో నాని ఒక బూతు మాట మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నిర్వహించిన దసరా ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక రిపోర్టర్ నానిని ప్రశ్నించారు.  

సాధారణంగా మీ సినిమాలను అమ్మాయిలు ఎక్కువగా చూస్తూ ఉంటారు లేడీస్ మీ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు అలాంటి లేడీస్ ని అసభ్యంగా మాట్లాడిన ఒక పదాన్ని ఎలా వాడారు అంటూ ప్రశ్నించగా దానికి నాని స్పందించారు. ,ఇది అది కాదన్నా నాని, తెలంగాణ యాసలో ఉండే బాంచత్ అనే పదంని తరతరాలుగా ఏ ఎమోషన్ కి వాడుతున్నామో ఆ ఎమోషన్ లానే తీస్కోండి, నార్త్ ఇండియా వెర్షన్ గురించి మాట్లాడకండని అన్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళం లోని స్టార్ నటుడు షైన్చాన్ టాకో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Also Read; Aero india 2023: ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏరో ఇండియా 2023 ప్రారంభం.. థీం ఏంటో తెలుసా?

Also Read: Best Camera Smartphones: 15 వేలలో అదిరిపోయే కెమెరా ఫోన్లు.. ఫీచర్లతో సహా మీకోసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News