Valimai in ZEE5: 25 నుండి ZEE5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవనున్న అజిత్‌ 'వలీమై' సినిమా..

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్, తెలుగు యువ నటుడు కార్తికేయ, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలలో నటించిన సూపర్ హిట్ సినిమా 'వలీమై' ZEE5 లో స్ట్రీమింగ్ అవనుంది. ZEE5 ఏర్పాటు చేసిన అజిత్‌ కుమార్ 10,000 చదరపు అడుగుల అతిపెద్ద పోస్టర్‌ తో సంచలనం సృష్టిస్తుంది. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 12:04 PM IST
  • సంచలనం సృష్టిస్తున్న ZEE5 అజిత్‌ 10 వేల చదరపు అడుగుల పోస్టర్‌
  • వలీమైలో విలన్ గా నటించిన కార్తికేయ
  • ZEE5 వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్రత్యేక ధర రూ. 599/- మాత్రమే!
Valimai in ZEE5: 25 నుండి ZEE5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవనున్న అజిత్‌ 'వలీమై' సినిమా..

Ajith's Valimai movie straming in Zee5: ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు ఎల్లప్పుడూ అద్భుతమైన చలనచిత్రాలను చందాదారులకు మరియు చలనచిత్ర ప్రియులకు ప్రతి నెలా తాజా కంటెంట్  ను అందిస్తూ 'ZEE5 ఓటిటి' అంటే 'వినోదం మాత్రమే కాదు, అంతకు మించి' అన్నట్లు దూసుకు పోతూ  అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది. ఇప్పుడు, అజిత్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ "వలీమై" ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ బ్లాక్‌బస్టర్ ప్రీమియర్‌ను చూసే సమయం వచ్చింది.

తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ నటించిన 'వలీమై' చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈనెల 25 నుంచి ప్రదర్శితం కానుంది. అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం ZEE5 సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యింది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్‌ అవుతూ అజిత్‌ ఇమేజ్‌ను మరింతగా పెంచుతోంది. అందరూ ఈ పోస్టర్‌ను చూసి అభినంది స్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అజిత్‌ అభిమానులతో పాటు, భారతీయ ప్రేక్షకుల కోసం ఈనెల 25 నుంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం 'వలీమై' మా జీ`5 ఓటీటీలో ప్రదర్శిస్తుండటం చాలా గర్వంగా ఉంది అన్నారు.

2022లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా వలీమై. ఇందులో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ఫుల్ యాక్షన్ ఏంటర్ టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్స్ తో  కూడిన క్లీన్ కాప్ డ్రామా గా తెరకెక్కిన  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వలిమై.. నటుడు అజిత్ కుమార్ యొక్క మాగ్నెటిక్ స్క్రీన్ వ్యక్తిత్వం మరియు కార్తికేయ యొక్క సాతాను అవతార్ మధ్య జరిగిన ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకుల స్పందనతో సినిమా హాళ్లు సైతం దద్దరిల్లిపోయాయి.

హెచ్.వినోత్ రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, కార్తికేయలు నటించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

12 భాషల్లో 3,500 సినిమాలు, 500+ టీవీ షోలు, 4,000+ మ్యూజిక్ వీడియోలు, 35+ థియేటర్ ప్లేలు మరియు 90+ లైవ్ టీవీ ఛానెల్‌లతో, ZEE5 ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వీక్షకుల కోసం సాటిలేని కంటెంట్ అందిస్తుంది. ఇప్పుడు, ZEE5 వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్రత్యేక ధర రూ. 599/- మాత్రమే!

Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?

Also Read: IPL History: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..ఎవరెవరంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News