Movies this Week: ఈ వారం ఓటీటీ, ధియేటర్ల రిలీజ్ చిత్రాలివే

Movies this Week: కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గడంతో మళ్లీ థియేటర్లు నిండుకుంటున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తుంటే మరికొన్ని ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొన్ని రెండింటిలోనూ విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2021, 01:28 PM IST
Movies this Week: ఈ వారం ఓటీటీ, ధియేటర్ల రిలీజ్ చిత్రాలివే

Movies this Week: కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గడంతో మళ్లీ థియేటర్లు నిండుకుంటున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తుంటే మరికొన్ని ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొన్ని రెండింటిలోనూ విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.

కరోనా మహమ్మారి(Corona Pandemic)కారణంగా దాదాపు ఏడాదిన్నరగా సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాలైతే ఓటీటీలను ఆశ్రయించి నష్టాల్నించి బయటపడినా..భారీ బడ్దెట్ సినిమాలు మాత్రం దెబ్బతిన్నాయి. కొన్ని సినిమాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీల్లో విడుదల కాగా..ఇంకొన్ని థియేటర్ల ప్రారంభం కోసం ఎదురు చూసి..ధియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు కరోనా ప్రభావం దాదాపుగా తగ్గడంతో మరోసారి థియేటర్లు నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కొన్ని సినిమాలు ఓటీటీల్లోనూ మరికొన్ని సినిమాలు థియేటర్లలోనూ విడుదల కాబోతున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

యదార్ధ సంఘటన ఆధారంగా ఎన్వీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అసలేం జరిగింది చిత్రం(Asalem Jarigindi)ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. శ్రీరామ్, సంచితా పదుకోన్ జంటగా నటించిన ఈ సినిమాను ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యాడ నిర్మించారు. 1970-80లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఓ అదృశ్య శక్తితో జరిగిన పోరాటాన్ని చిత్రంగా తీశారు. 

ఇక రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన నాట్యం సినిమా(Natyam Movie)అక్టోబర్ 22వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. భరతనాట్యం నేపధ్యంలో సినిమా రూపొందింది. ఇక మరో చిత్రం మధుర వైన్స్. జయకిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కొత్త నటులు సన్నీ నవీన్, సీమా చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. మద్యానికి బానిసైన ఓ యువకుడిగా, మద్యం అసహ్యపడే యువతిగా సాగిన చిత్రం అక్టోబర్ 22వ తేదీన ధియేటర్లో విడుదల కానుంది. 

ఇక ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar kammula)దర్శకత్వంలో తెరకెక్కిన నాగచైతన్య-సాయి పల్లవి రొమాంటి లవ్‌స్టోరీ సినిమా(Love Story) ఇప్పటికే ధియేటర్లలో విడుదలై హిట్‌టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదిక( OTT Movie) ఆహాలో(AHA) అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల్నించి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలోని సారంగ దరియా పాట(Saranga Dariya Movie)ఇప్పటికే టాప్‌హిట్‌గా మారింది. సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న హెడ్స్ అండ్ టేల్స్ సినిమా(Heads and Tales Movie)అక్టోబర్ 22 నుంచి జీ5లో(Zee5)స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేదే ఈ చిత్రం సారాంశం. కలర్ ఫోటో ఫేమ్ సందీప్‌రాజ్ కధ అందించగా..నటుడు సాయికృష్ణ దర్శకత్వం వహించారు. 

Also read: MAA Elections Effect: స్టేజీపై మాట్లాడుకొని పవన్- విష్ణు.. ట్విట్టర్ లో పవన్ వీడియో పోస్ట్ చేసిన మంచు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News