Hari Hara Veera Mallu release date: హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఖరారు

Hari Hara Veera Mallu release date confirmed: నేడు పవన్ కల్యాణ్ బర్త్‌డే (Pawan Kalyan's birthday celebrations) సందర్భంగా పవన్ కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హరి హర వీర మల్లు మూవీ యూనిట్ సినిమా రిలీజ్ డేట్ సైతం వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 06:06 PM IST
Hari Hara Veera Mallu release date: హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఖరారు

Hari Hara Veera Mallu release date confirmed: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ రానే వచ్చింది. పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమాల్లో ఒకటైన హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఖరారైంది. నేడు పవన్ కల్యాణ్ బర్త్‌డే (Pawan Kalyan's birthday celebrations) సందర్భంగా పవన్ కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హరి హర వీర మల్లు మూవీ యూనిట్ సినిమా రిలీజ్ డేట్ సైతం వెల్లడించింది. 

క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన అందాల నిధి నిధి అగర్వాల్ (Actress Nidhhi Agerwal) జంటగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఆదిత్యా మీనన్, శుభలేఖ సుధాకర్, పూజితా పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా కరోనా కారణంగా మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.

Also read : Pawan Kalyan birthday: పవన్ కల్యాణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన Mahesh Babu.. ట్వీట్ వైరల్

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు, ఏ.ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. 17వ శతాబ్ధం నాటి పీరియాడిక్ అడ్వంచరస్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ (Keeravani music) కంపోజ్ చేస్తున్నాడు. 

గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి పీరియాడిక్ మూవీస్ తెరకెక్కించిన క్రిష్ తొలిసారిగా మరో పీరియాడిక్ డ్రామాతో పవన్ కల్యాణ్‌ని డైరెక్ట్ చేస్తుండటంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లోనూ హరి హర వీర మల్లు మూవీపై (Hari Hara Veera Mallu movie) భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Also read : Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్"...అదిరిపోయిన టైటిల్ సాంగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News