Gunasekhar's Shakuntalam movie: గుణశేఖర్ టాలీవుడ్లో విలక్షణమైన, చారిత్రక, పౌరాణిక చిత్రాలను అందించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన అతి కొద్ది మంది ఈ తరం డైరెక్టర్లలో ముందుంటారు. ప్రస్తుతం రానా దగ్గుబాటితో హిరణ్యకశ్యప మూవీ ( Rana Daggubati's Hiranyakashyapa movie ) చేస్తున్న గుణశేఖర్ తాజాగా తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. గుణశేఖర్ ( Gunasekhar ) నుండి సినిమా అంటే అతడి సినిమాల అభిరుచి గురించి తెలిసిన వారికి ఆ సినిమాపై ఉండే అంచనాలే వేరు. అలాగే ఈ కొత్త సినిమా ప్రకటన కూడా అలాగే ఉంది. గుణశేఖర్ తీయనున్న తర్వాతి సినిమా పేరు 'శకుంతలం' గా ( Shakuntalam movie ) ఎనౌన్స్ చేశారు.
వెండితెరపై 'హిరణ్యకశ్యప'లో ( Hiranyakashyapa movie ) నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేయడానికంటే ముందు... భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ... అని 'శకుంతలం' మోషన్ పోస్టర్‌ను ( Shakuntalam motion poster ) శుక్రవారం సాయంత్రం 7.11 గంటలకు గుణశేఖర్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. Also read : Mahesh Babu, Venkatesh multistarrer: మహేష్ బాబు, వెంకీ కాంబోలో మరో మల్టీస్టారర్ ?
Before manifesting the spectacle of Narasimha Avatar on the silver screen in ‘Hiranyakashyapa’..
Presenting to you a whimsical ‘Tale of Love’ from the Adi Parva of the Mahabharata..https://t.co/eVK7a9r4Ze— Gunasekhar (@Gunasekhar1) October 9, 2020
గుణశేఖర్ సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అయిన 'హిరణ్యకశ్యప' చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, అయితే కరోనా మహమ్మారి కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందని ప్రకటించారు. ఈలోగా మరో ప్రాజెక్టును అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు. 'హిరణ్యకశ్యప' సినిమా రుద్రమదేవి సినిమా ( Rudramadevi movie ) తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రుద్రమ దేవి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిన్నటికి 5 ఏళ్లు. Also read : Niharika bachelorette party: ఫ్రెండ్స్‌తో నిహారిక బ్యాచిలర్ పార్టీ
ప్యాన్ ఇండియా చిత్రం అయిన 'శకుంతలం' సినిమాను నీలిమ గుణ ప్రొడ్యూస్ చేయనుండగా, మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించి నటీనటులను అనౌన్స్ చేయలేదు. Also read : Venkatesh, mahesh babu: కరోనాపై మహేష్ బాబు, వెంకటేష్ పోరాటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe