Rama Banam Poster : గోపీచంద్ వదిలిన మొదటి బాణం.. ఇంట్రెస్టింగ్ పోస్టర్

Maha Shiva Ratri 2023 Special Poster మహా శివరాత్రి స్పెషల్‌గా టాలీవుడ్‌ నుంచి కొన్ని కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో రామబాణం అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 09:06 PM IST
  • మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్
  • గోపీచంద్ రామబాణం ఫస్ట్ లుక్
  • మొదటి బాణం వదిలిన గోపీచంద్
Rama Banam Poster : గోపీచంద్ వదిలిన మొదటి బాణం.. ఇంట్రెస్టింగ్ పోస్టర్

Gopichand Rama Banam Poster గొపీచంద్, శ్రీవాస్ కాంబోలో ఇది వరకు లక్ష్యం, లౌక్యం అనే సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో చిత్రం రాబోతోంది. ఇక ఈ హ్యాట్రిక్ సినిమాకు నందమూరి బాలకృష్ణ టైటిల్‌ను పెట్టేశాడు. ఆహా అన్ స్టాపబుల్ షోలో గోపీచంద్ వచ్చినప్పుడు బాలయ్య ఓ టైటిల్‌ను సూచించాడు. దాంతో బాలయ్య సూచించినట్టుగానే రామబాణం అనే టైటిల్‌ను గోపీచంద్ ఫిక్స్ చేసుకున్నాడు. మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News