GoodLuck Jerry First Look: చేతిలో పిస్తోల్ ప‌ట్టుకొని.. భ‌య‌ప‌డుతూ, భ‌య‌పెట్టిస్తోన్న జాన్వీ క‌పూర్!

Janhvi Kapoor's GoodLuck Jerry movie First Look Poster released. జాన్వీ క‌పూర్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న'గుడ్ లక్‌ జెర్రీ' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2022, 08:26 PM IST
  • చేతిలో పిస్తోల్ ప‌ట్టుకొని
  • భ‌య‌పెట్టిస్తోన్న జాన్వీ క‌పూర్
  • జూలై 29 నుంచి స్ట్రీమింగ్‌
GoodLuck Jerry First Look: చేతిలో పిస్తోల్ ప‌ట్టుకొని.. భ‌య‌ప‌డుతూ, భ‌య‌పెట్టిస్తోన్న జాన్వీ క‌పూర్!

Janhvi Kapoor's GoodLuck Jerry movie First Look Poster Out: బాలీవుడ్ బ్యూటీ, దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ క‌పూర్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న తాజా సినిమా 'గుడ్ ల‌క్ జెర్రీ'. స్టార్‌ హీరోయిన్ నయనతార నటించిన 'కోలమావు కోకిల' అనే తమిళ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. 'కోకో కోకిల' అనే టైటిల్‌తో తెలుగులోనూ డబ్‌ అయింది. గుడ్ ల‌క్ జెర్రీ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్ వ‌స్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు జాన్వీ అభిమానులు. వారికోసం ఓ అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. 

'గుడ్ లక్‌ జెర్రీ' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఇందులో ఒక పోస్టర్‌లో జాన్వీ క‌పూర్ తుపాకీ పట్టుకుని భ‌య‌పెట్టిస్తోంది. మరో దాంట్లో భయంతో లంచ్‌ బాక్స్‌ ఉన్న టేబుల్‌ వెనుక దాక్కుని కొంచెం భ‌యాన‌కంగా క‌నిపిస్తోంది. ఈ పోస్టర్స్‌ను జాన్వీ క‌పూర్ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'నేను కొత్త సాహసయాత్రలో ఉన్నాను, గుడ్ ల‌క్ చెప్పను' అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.  ఈ స్పీమా నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

గుడ్ లక్‌ జెర్రీ చిత్రాన్ని పంజాబ్‌, చండీగ‌ఢ్ ప్రాంతాల్లో షూట్ చేశారు. కామెడీ క్రైం సినిమాగా వ‌స్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దీప‌క్ డోబ్రియాల్‌, మిఠా వ‌సిష్ఠ‌, నీర‌జ్ సూద్‌, సుశాంత్ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి లేడీ సూపర్ స్టార్ నయనతార స్థాయిలో నటించిందో లేదో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

Also Read: Unhealthy Food for Liver: ఇవి తింటే కాలేయ వ్యాధులు తప్పవు.. వీటిని అస్సుల తినకండి..!

Also Read: Agnipath Protest: ఆర్మీలో చేరాలని కలలు కన్న రైతు బిడ్డ.. పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News