OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, రేపు ఒక్కరోజే 19 సినిమాల స్ట్రీమింగ్

OTT Movies: ఓటీటీలు అందుబాటులో వచ్చాక ఎంటర్‌టైన్‌మెంట్ అర్ధమే మారిపోయింది. థియేటర్లతో సమానంగా సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. అన్ని భాషల కంటెంట్ కావల్సినంత లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే సినీ నిర్మాతలు సైతం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2023, 09:39 PM IST
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, రేపు ఒక్కరోజే 19 సినిమాల స్ట్రీమింగ్

OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరగడంతో సినీ మేకర్లు థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ అని రెండు తేదీలు పెట్టుకుంటున్నారు. ఒక్కోసారి థియేటర్ కంటే ఓటీటీ రిలీజ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రేపు శుక్రవారం ఓటీటీ ఫాలోవర్లకు పండగే అని చెప్పాలి. రేపు ఒక్కరోజే వివిధ ఓటీటీల్లో ఏకంగా 19 సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఓటీటీలకు ఆదరణ పెరగడంతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు వివిధ రకాల కంటెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా స్ట్రీమ్ అవుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త ఓటీటీలు కూడా అందుబాటులో వస్తున్నాయి. ఓటీటీలకు భాషాపరమైన సమస్య లేకపోవడంతో అన్ని ఓటీటీలకు అన్ని ప్రాంతాల్లో ఆదరణ ఉంటోంది. అందుకే కొత్త కొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ తప్పనిసరిగా ప్రకటిస్తున్నాయి. అటు ప్రేక్షకులు కూడా ఇంట్లో కూర్చుని తీరిక ఉన్నప్పుడు హాయిగా కుటుంబమంతా కలిసి చూసే అవకాశముండటం లేదా వీలున్నప్పుడల్లా మొబైల్ లేదా టీవీల్లో చూసే పరిస్థితి ఉండటంతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు పెరుగుతున్నాయి. రేపు అంటే జూలై 14 శుక్రవారం ఓటీటీ ప్రేమికులకు శుభవార్తే. ఏకంగా 19 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఇందులో తెలుగు , హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. 

ఆహా ఓటీటీలో రేపు అంటే జూలై 14న నేను స్టూడెంట్ సర్ తెలుగు సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక తమిళ సినిమా మెన్ టూ కూడా రేపే స్ట్రీమ్ కానుంది. ఇక జీ5లో తెలుగు వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్, తమిళ సినిమా ఎస్టేట్ స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ఓటీటీలో  తెలుగు డబ్బింగ్ సినిమా తందట్టి, ఇంగ్లీ,ష్ వెబ్ సిరీస్ ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ సీజన్ 2 , తెలుగు వెబ్ సిరీస్ హాస్టల్ డేస్ స్ట్రీమింగ్ అవుతాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సినిమా బూర్డ్ బాక్స్ బార్సిలోనా, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ టూ హాట్ టూ హ్యాండిల్ సీజన్ 5 , హిందీ సినిమా కోహ్రా, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ క్వార్టర్ బ్యాక్, జపనీస్ వెబ్ సిరీస్ బర్న్ ది హౌస్ ఆఫ్ డౌన్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ , ఇంగ్లీష్ సినిమా మిస్టర్ కార్ అండ్ ది నైట్స్, కొరియన్ వెబ్ సిరీస్ కింగ్ ద ల్యాండ్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీ వెబ్ సిరీస్ ది ట్రబుల్ స్ట్రీమ్ కానుంది. ఇక జియో సినిమాలో ఇష్క్ ఎ నాదాన్ హిందీ సినిమా విడుదల కానుంది. సోనీలివ్‌లో హిందీ వెబ్ సిరీస్ కాలేజ్ రొమాన్స్ సీజన్ 4, అన్ ఛార్టెడ్ సినిమా స్ట్రీమింగ్ అవనున్నాయి. మనోరమ మ్యాక్స్‌లో మలయాళం సినిమా టిక్కక్కొరు ప్రేమొందరన్ , ఆపిల్ టీవీ ప్లస్‌లో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఫౌండేషన్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానున్నాయి.

Also read: Nani 30 Glimpse: 'హాయ్ నాన్న'గా వచ్చేసిన నాని.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News