Shivam Bhaje Teaser Talk Review: ఆసక్తిరేకిస్తోన్న అశ్విన్ బాబు ‘శివం భజే’ మూవీ టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..

Shivam Bhaje Teaser Talk Review : అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శివం భజే’.  గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి తొలిసారి నిర్మాతా తెరకెక్కించిన చిత్రం 'శివం భజే'. ఇప్పటి వరకు  టైటిల్, ఫస్ట్ లుక్  తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ఆసక్తిరేకిస్తోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 20, 2024, 06:30 AM IST
Shivam Bhaje Teaser Talk Review: ఆసక్తిరేకిస్తోన్న అశ్విన్ బాబు ‘శివం భజే’ మూవీ టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..

Shivam Bhaje Teaser Talk Review:  గత కొన్నేళ్లుగా తెలుగులో న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతోన్న చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో అశ్విన్  బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శివం భజే’.  ఈ చిత్రం యాక్షన్ కమ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు డివోషనల్  టచ్ తో ఈ సినిమా ఆసక్తిరేకిస్తోంది. హీరో అశ్విన్ కి ఏదో డిఫరెంట్ మానసిక సమస్య ఉన్నట్టు బ్రహ్మాజీ, హైపర్ ఆది లతో చెప్పించడం,అంతేకాదు ఇన్వెస్టిగేషన్ లో బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీన వంటి పలువురు నటులు ఈ సినిమాలో నటిస్తుండంతో ఈ సినిమాపై ఆసక్తి రేకిస్తోంది. అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నిటి వెనక దైవం ఉనికి ఉందని చెబుతూ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అశ్విన్ బాబు రౌద్ర రూపంలో రౌడీలను త్రిశూలంతో ఎత్తి పడేయడం... అన్నిటినీ మించి చివరగా అదిరిపోయే గ్రాఫిక్స  విజువల్స్ లో దాచిన ఆ మహా దేవుడి దర్శనం.. దానికి వికాస్ బడిస బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయని చెప్పొచ్చు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..

డిఫరెంట్ కాన్సెప్ట్  కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'శివం భజే'. కొత్త కథ, కథనాలకి తగ్గట్టుగా ఈ సినిమాను ఉన్నత సాంకేతిక అంశాలతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.  టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  టీజర్ కి మంచి స్పందన రావడం మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది.  మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్ కూడా ఈ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఆ శివయ్య ఆశీస్సులతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తున్నాము.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ..
'శివం భజే' టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించిన మా సినిమా టీజర్ కి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు అన్ని భాషల ప్రేక్షకులు, వీక్షకుల నుండి అనూహ్యమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. మా నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి సహకారంతో ఈ చిత్రం చాలా బాగా వచ్చిందన్నారు. మా పాటలు, ట్రైలర్, విడుదల తేదీ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాము.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ..
‘శివం భజే' టీజర్ కి వచ్చే అనూహ్య స్పందనకి అందరికీ థాంక్స్.  అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా సస్పెన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు దైవత్వంతో ఈ చిత్రం ఉంటుందన్నారు. మా దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ శివయ్య అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాద బలంతో త్వరలోనే మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము.

నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు నటించారు.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా),మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి,దర్శకత్వం : అప్సర్, ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస,ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ

Also Read: Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News