Game On Movie Review: 'గేమ్ ఆన్' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే సైకాలజికల్ థ్రిల్లర్..

Game On Movie review: గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్‌లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'గేమ్‌ ఆన్‌'. ఈ రోజు విడుదలైన ఈ మూవీతో దయానంద్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. రవి కస్తూరి నిర్మించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 2, 2024, 07:33 AM IST
Game On Movie Review: 'గేమ్ ఆన్' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే సైకాలజికల్ థ్రిల్లర్..

రివ్యూ: గేమ్ ఆన్ (Game On)
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, మధుబాల, ఆదిత్య మీనర్, శుభలేఖ సుధాకర్, వాసంతి, కిరిటీ తదితరులు..
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథ్
ఎడిటర్: వంశీ అట్లూరి
సంగీతం: అభిషేక్
నిర్మాత: రవి కస్తూరి
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: దయానంద్

గత కొన్నేళ్లుగా తెలుగులో సరికొత్త కాన్సెప్ట్‌తో మూవీలు తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'గేమ్ ఆన్'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

కథ విషయానికొస్తే..
గేమ్ ఆన్ (Game On) కథ విషయానికొస్తే.. సిద్దు (గీతానంద్) ఓ అనాథ. ఓ గేమింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేయలేక బాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. ఆ తర్వాత బాస్ ఓ విషయంలో అతని చేసిన పనికి ఆఫీస్ నుంచి తొలిగిస్తాడు. మరోవైపు అతను నమ్ముకున్న స్నేహితుడు, ప్రియురాలు అతన్ని మోసం చేస్తారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆత్మహత్య చేసుకునే టైమ్‌లో అతనికో అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ వస్తోంది. అందులో అతను సిద్దుకు ఓ టాస్క్ ఇస్తారు. వాళ్లు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామని చెబుతారు. ఈ క్రమంలో అతను వాళ్లు చెప్పిన పని చేసాడా.. ? ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ? అనాథ అనుకున్న అతని జీవితంలో అమ్మ, తాత ఉంటారు. వాళ్లు ఏమయ్యారు ? సారా (నేహా సోలంకి) ఎవరు ? ఈ క్రమంలో సిద్దుకు ఫోన్‌లో అజ్ఞాతవ్యక్తి చెప్పిన టాస్క్ ను ఎలా కంప్లీట్ చేసాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు దయానంద్ తన ముందు నుంచి యూట్యూబ్‌లలో తన క్రియేటివ్ వీడియోలతో పేరు తెచ్చుకున్నాడు.ఇక 'గేమ్ ఆన్' విషయానికొస్తే..హాలీవుడ్ సినిమాల ఇన్‌స్ప్రిరేషన్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌ను లూజర్‌గా చూపించడం.. ఆ తర్వాత అజ్ఞాతవ్యక్తి ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసే క్రమంలో విన్నర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమాలో చూపించాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే మానసికంగా బలహీనుడైన హీరో.. ఎలా బలవంతుడిగా మారే క్రమాన్ని ఇంట్రెస్ట్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. సైకాలాజికల్‌గా సాగే ఈ థ్రిల్లర్‌లోకి ప్రేక్షకులను వెంటనే తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. అసలు హీరోకు అజ్ఞాతవ్యక్తి ఎందుకు టాస్క్ ఇచ్చాడనేది క్లైమాక్స్‌లో చూపించారు. ఈ క్రమంలో అజ్ఞాతవ్యక్తి హీరోలకు ఒక్కో టాస్క్‌కు కొంత అమౌంట్‌ను అతని ఖాతాలో వేయడం అనేది కొంత లాజిక్‌గా అనిపించదు. అటు హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ యూత్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ చూపించిన దర్శకుడు.. క్లైమాక్స్‌లో రొటిన్ రివేంజ్ డ్రామా చూపించాడు. హీరో కొత్త నటుడైన అతనితో మంచి యాక్టింగ్ రాబట్టాడు. లాజిక్‌కు దూరంగా ఉన్న ఓవరాల్‌గా ఓకే అనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ ఓకే అనిపిస్తాయి. ఇతర టెక్నిషన్స్ విషయానికొస్తే..  ఈ సినిమాకు అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదను పెడితే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే..
కొత్త నటుడు అయిన..గీతానంద్.. యాక్టింగ్, ఫైటింగ్ అన్ని విషయాల్లో ఈజ్‌తో నటించాడు. హీరోకు మంచి భవిష్యత్తు ఉంది. నేహా సోలంకి ఉన్నంతలో పర్వాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ నటించి వావ్ అనిపించింది. ఇక ఈ సినిమాలో ఆదిత్య మీనన్ నటన ఆకట్టుకుంది. మధుబాల, శుభలేఖ సుధాకర్ తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్
 
కథ

ఇంటర్వెల్ బ్యాంగ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్'

మైనస్ పాయింట్స్

రొటిన్ క్లైమాక్స్
 
లాజిక్ లేని సన్నివేశాలు

ఎడిటింగ్
 
పంచ్ పాయింట్.. ఆకట్టుకునే సైకాలజికల్ థ్రిల్లర్..

రేటింగ్: 3/5

Also Read: IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు

Also Read: Telangana Jobs: నిరుద్యోగుల్లారా మీకు నేనున్నా.. కేసీఆర్‌లా కాదు 2 లక్షల ఉద్యోగాలిస్తా: రేవంత్‌ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News